Andhra PradeshEast GodavariNews

సీనియర్‌ న్యాయవాది ఎస్‌.ఆర్‌.కె. హనుమంతరావు కన్నుమూత
రాజమహేంద్రవరం :
రాజమండ్రికి చెందిన సుప్రసిద్ధ సీనియర్‌ న్యాయవాది ఎస్‌.ఆర్‌.కె. హనుమంతరావు కన్నుమూశారు. వృద్ధాప్యంతో గత కొంతకాలంగా ఇంటికే పరిమితమైన ఆయన గత అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఏవీఏ రోడ్డులోని అపార్ట్‌ మెంట్‌లో తుదిశ్వాస విడిచారు. 1931లో పుట్టిన జన్మించిన ఆయన వయస్సు 90 సంవత్సరాలు. ఆయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరూ లా చదివారు. కుమారుడు ఎస్‌.కుమార్‌ ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. కుమార్తె లక్ష్మికి గోపితో పెళ్లి తర్వాత బెంగుళూరులో కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత అమెరికాలో సెటిలయ్యారు. హనుమంతరావు ప్రముఖ క్రిమినల్‌ లాయర్‌గా ఎన్నో కీలకమైన కేసులు వాదించారు. లీడిరగ్‌ లాయర్‌గా లెక్కుకుమించి కేసులు వాదించి గెలిచారు. దాదాపు 100 మంది న్యాయవాదులను తీర్చిదిద్దారు. అందులో చాలామంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా, గవర్నమెంట్‌ ప్లీడర్లుగా, హైకోర్టు న్యాయమూర్తులుగా, ఆయా జిల్లాల న్యాయమూర్తు లుగా పనిచేశారు. ఇంకా కొందరు పనిచేస్తున్నారు. అంతేకాదు, ఎందరో ఈయన దగ్గర శిష్యరికం చేసి, ఉన్నత న్యాయవాదులుగా రాణిస్తున్నారు. హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కెసి భాను దంపతులు, హైకోర్టు న్యాయవాది చల్లా ధనుంజయ, పలువురు నాయ్యమూర్తులు, హైకోర్టు, జిల్లా కోర్టు న్యాయవాదులు ఈయన దగ్గర శిష్యరికం చేసి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా, గవర్నమెంట్‌ ప్లీడరుగా పనిచేసి, సీనియర్‌ న్యాయవాది డీవీకే రమేష్‌, అలాగే బార్‌ అసోసియేషన్‌ పూర్వ అధ్యక్షులు చింతపెంట ప్రభాకర్‌ తదితరులు హనుమంతరావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు, ఎస్‌ఎన్‌ఎం మూర్తి, జివియుబి రాజు, భట్టు సునీల్‌కుమార్‌, ఎవి సత్యకుమార్‌, ఎంఎస్‌బి శంకర్‌, కెవివి ప్రసాద్‌, డివికె రమేష్‌, వి.శ్రీనివాసరావు, బార్లపూడి రవికుమార్‌, ఎస్‌.ఆనంద వేలు, తదితరులు సంతాపం తెలిపారు. కాగా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన జస్టిస్‌ కెఎస్‌ అప్పారావు కూడా హనుమంతరావు దగ్గర శిష్యరికం చేసారు. హనుమంతరావు భౌతిక కాయానికి ఇన్నీసుపేట రోటరీ కైలాస భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు.

Comment here