Andhra PradeshEast GodavariNews

250 కేజీల రేషన్ బియ్యం పట్టివేత

250 కేజీల రేషన్ బియ్యం పట్టివేత

* కృష్ణుని పాలెం పరిధిలో పట్టుకున్న బియ్యం

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  రాత్రి సమయంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గ్రామస్థులు కొందరు, నాయకులు, వాలంటీర్లు కలిసి పట్టుకున్నారు. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో గోకవరం మండలం కృష్ణుని పాలెం లోని రేషన్ షాప్ నుండి పేదలకు పంపిణీ చేసే బియ్యం రవాణా అవుతుందని తెలుసుకుని పట్టుకున్నారు. బైక్ పై ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి తరలిస్తుండగా పట్టుకున్నారు. ముందు కొన్ని బస్తాలు పట్టుకెళ్లగా, రెండోసారి మళ్ళీ తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. సుమారు 250 కేజీల బియ్యం ఉండొచ్చని చెపుతున్నారు. రాత్రి బియ్యాన్ని పట్టుకున్న సమయంలో వాలంటీర్ల తో పాటు గ్రామస్థులు, నాయకులు ఉన్నారు. ఎక్కడ నుండి ఎక్కడికి పట్టుకెళ్తున్నారు, ఈ సమయంలోనే ఎందుకు పట్టుకు వెళ్తున్నారు అనే విషయాలు అడిగారు.  పట్టుకున్న బియ్యాన్ని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారులు చెప్పాల్సి ఉంది.

Comment here