Andhra PradeshEast GodavariNews

97 నూతన  పెన్షన్లు పంపిణీ

97 నూతన  పెన్షన్లు పంపిణీ
కోస్తా ఎన్ కౌంటర్ జగ్గంపేట
    మండల కేంద్రమైన జగ్గంపేట పంచాయతీ పరిధిలో మంజూరైన 97 నూతన పెన్షన్లను శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట సర్పంచి బచ్చల నాగరత్నం, ఉపసర్పంచి బండారు రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన 97 పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంకా ఎవరైనా పెన్షన్లకి అర్హులై పెన్షన్లు రానివారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని వారి తెలిపారు.  ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Comment here