Uncategorized

ఆకివీడులో ఘనంగా 75 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు.

శ్రీదేవి స్వీట్ షాప్ యజమాని గుర్రాని శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా 75 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
కోస్తా ఎన్ కౌంటర్ ఆకివీడు : బ్రిటీష్ తెల్ల దొరల బానిస సంకెళ్లు వీడి, మనల్ని మనం పాలించు కొనే రోజు వచ్చిన రోజు, ఆగస్టు 15 అని ప్రముఖ వ్యాపార వేత్త, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి మదని అన్నారు. ఆకివీడు ముస్లిం కాంప్లెక్స్ వద్ద శ్రీ దేవి స్వీట్స్ గుర్రాని శ్రీను ఆధ్వర్యంలో 75 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకివీడు ఏ ఎమ్ సి చైర్మన్ ఎండి మస్తాన్, ప్రముఖ న్యాయవాది పల్లి ప్రభాకర్ రెడ్డి, ఎండి మదని లు మాట్లాడుతూ ఎంతో మంది, యెన్నో త్యాగాల ఫలితంగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది అన్నారు. వారి త్యాగాలు ఈ నాటి యువత తెలుసు కొ వలసిన అవసరం ఉందని అన్నారు. ఈనాడు మనం పట్టణాల్లో, గ్రామాల్లో, ప్రశాంతంగా నిద్ర పోతున్న మంటే మన సైనికులు త్యాగాలు అని, నిద్ర, ఆహారం లేకుండా మన సైన్యం కాపలా కాస్తూ వుందని అన్నారు. స్వతంత్ర సమరయోధులను, దాన్ని రక్షిస్తున్నసైనిలను, యెన్నటికీ మరువ రాదన్నారు. అనంతరం సీట్లు పంచారు. కార్య క్రమంలో డాక్టర్ బిలాల్, నౌ కట్ల రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Comment here