Uncategorized

పేపర్ మిల్ యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి

*పేపర్ మిల్ యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి.
కడియం యూనిట్ కార్మికులకు వేతన ఒప్పందం వెంటనే చేయాలి*
 కడియం కోస్టల్ పేపర్ మిల్లు కార్మికులు తమ నూతన వేతన ఒప్పందం వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ రాజమండ్రి పేపర్ మిల్ ప్రధాన గేట్ వద్ద ఆందోళన నిర్వహించారు.శుక్రవారం  కడియం నుండి ర్యాలీగా రాజమండ్రి వచ్చి ఎపి పేపర్ మిల్లు వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా వైస్ ప్రెసిడెంట్ టి అరుణ్,జిల్లా కార్యదర్శి ఎస్.ఎస్.మూర్తి ,సిపిఎం పట్టణ కార్యదర్శి పొలినవంకటేశ్వర రావు,సీఐటీయూ వైస్ ప్రెసిడెంట్ పూర్ణిమారాజు పేపర్ మిల్లు యూనియన్ అధ్యక్షులు ఎస్.వెంకటేశ్వర రావు,కడియం యూనిట్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్సులు సాయిబాబా,సాగర్ ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు.సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్  మాట్లాడు తూ కడియం పేపర్ మిల్లు యాజమాన్యం  గతఎగ్రిమెంట్ పూర్తయ్యి 26 నెలలు గడిచిపోయినా ఇప్పటికే నూతన వేతన ఒప్పందం  చేయక పోవడం దుర్మార్గమని అన్నారు.కార్మికులు కరోన కాలంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేస్తే యాజమాన్యం లాభాలు మూటకట్టుకుని కార్మికుల కష్టానికి ప్రతిఫలం ఇవ్వకపోవడం అమానవీయమని అన్నారు.కడియం పేపర్ మిల్ లో ఇటీవల రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి చేసిన కార్మికులను గాలికి వదిలేసి యాజమాన్య ప్రతినిధులు తమ జీతభత్యాలు పెంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే నూతన వేతన ఒప్పందం  చేయక పోతే ఈ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.కరోనా సోకి కార్మికులు చనిపోయినా వారి కుటుంబాలకు ఎటువంటి భీమా సౌకర్యం అందలేదని,.ఎగ్రిమెంట్  చేయమని 60 రోజులుగా కోస్టల్. పేపర్ మిల్లు వద్ద ఎండా,వానా లెక్క చేయకుండా నిరసన తెలియజేస్తున్న యాజమాన్యం చర్చలకు పిలవక పోవడం సరికాదన్నారు.వెంటనే అగ్రిమెంట్ చేయాలని లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో కోస్టల్. పెపెరిమిల్లు యూనియన్ అధ్యక్ష,కార్యదర్సులు సాయిబాబు,సాగర్,యేసు,రాము,సెంకర్, తదితరులు పాల్గొన్నారు.

Comment here