Uncategorized

శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలో ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలో ఘనంగా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
రాజమహేంద్రవరం, ఆగష్టు 15:  భారత దేశ స్వాతంత్వ  వజ్రోత్సవ సందర్భంగా స్థానిక ప్రకాష్ నగర్ లో  శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రాఘవ  కుమారి జాతీయ జెండా ఆవిష్కరించి ఎన్.ఎస్.ఎస్ కేడేట్స్  గౌరవ వందనాన్ని స్వీకరించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ పేరేడ్ వేడుకల అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్డులనుద్దేశించి ఆనాటి తరం స్వాతంత్ర సమరోద్యమంలో చేసిన పోరాట ఫలాలే నేడు మనం అనుభవిస్తున్నామని, దేశభక్తి యొక్క సరైన నిర్వచనం సమయ పాలన, వ్యక్తిగత  క్రమశిక్షణ అని, మన దేశం సాంకేతిక పరంగాను, వైజ్ఞానికంగాను సాధిస్తున్న ప్రగతి వివరించి, విద్యార్దుల్లో స్పూర్తిని నింపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా పాల్గొన్న ఎస్.కె.ఆర్ ఎం.బి.ఏ ప్రిన్సిపాల్ శ్రీమతి వి. విద్యా ప్రతిమ  మరియు ఎస్.కె.ఆర్ డి.ఈ.డి కాలేజి  ప్రిన్సిపాల్ శ్రీమతి జి. లక్ష్మీ ప్రసన్న విద్యార్డులనుద్దేశించి  ప్రసంగించారు. అనంతరం వివిధ పోటీలలో విజేతలకు బహుమతుల ప్రధానం చేశారు.  ఈ కార్యక్రమంలో ఎస్.కె.ఆర్ విద్యాసంస్థల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్దినులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరయ్యారు.

Comment here