Andhra PradeshEast GodavariNews

అక్క చెల్లెమ్మలకు అన్న ఇచ్చే కానుక ‘ఆసరా’

అక్క చెల్లెమ్మలకు అన్న ఇచ్చే కానుక ‘ఆసరా’
… 32 సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్న జగనన్న
… కడుపు మంట బ్యాచ్ ఇళ్ల స్థలాల పై న్యాయస్థానాల్లో మోకాలడ్డు
కోస్తా ఎన్ కౌంటర్, సర్పవరం: రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగనన్న అందిస్తున్న కానుకలే వైయస్సార్ ఆసరా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని రమణ పేట పంచాయతీ పరిధిలో స్పందన ఫంక్షన్ హాల్ లో వైయస్సార్ ఆసరా పథకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మండల అభివృద్ధి అధికారి పాఠం శెట్టి నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పార్లమెంట్ సభ్యులు వంగా గీత విశ్వనాథ్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా నిలవాలని సంకల్పించిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం ముప్పై రెండు పథకాలను అమలు చేస్తూ ప్రజలకు నేరుగా అందించడం జరుగుతుందన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మలకు గత ప్రభుత్వం చేసిన మోసాన్ని గుర్తించుకుని వారికి అండగా నిలవాలని సంకల్పించి రూ  20 వేల కోట్ల రుణమాఫీ చేసిన  ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రతి పేదవాడు సొంతింటి కలను నెరవేర్చాలని 30 లక్షల మందికి పట్టాలు అందించడం జరిగిందన్నారు. అనారోగ్యం పాలై ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని అమ్మ ఒడి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అన్నారు. రూరల్ నియోజకవర్గం నుంచి ఎన్నుకోబడ్డ కన్నబాబు కు ఆరు శాఖలను అప్పగించి రాష్ట్రంలో సమర్థవంతంగా పరిపాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కన్నబాబు మాట్లాడుతూ వైయస్సార్ ఆసరా రెండోవిడత ప్రతి మహిళకు దసరా కానుకగా అందిస్తున్నామన్నారు. డ్వాక్రా సంఘాల విప్లవ మహిళా శక్తి గా ఉండటం జరిగిందన్నారు. 2014 ఎన్నికల్లో గత ప్రభుత్వం డాక్రా రుణమాఫీ చేస్తానని నమ్మబలికి నాలుగేళ్లు గడిచినా మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, అనంతరం ఎన్నికలు సమీపించిన సమయంలో పసుపు కుంకుమ డ్వాక్రా సంఘాల మహిళలు మాయమాటలు చెప్పినవారికి సరైన గుణపాఠం చెప్పడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి మాటతప్పని మడమ తిప్పని నాయకుడని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అక్కాచెల్లెమ్మలను ఆనందం కోసం రుణమాఫీ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైయస్సార్ ఆసరా కింద కాకినాడ రూరల్ మండలం లో రెండు సంవత్సరాలుగా రూ 120 కోట్లు 50 వేల కుటుంబాలకు అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్న అర్హులైన పేదలందరికీ 31 లక్షల మందికి 12 వేల కోట్లతో స్థలాలను కేటాయిస్తే కొంతమంది  కడుపు మంట బ్యాచ్ నాయి స్థానాలను అడ్డుపెట్టుకొని పేదలకు ఇచ్చే స్థలాల్లో మోకాలడ్డు పెడుతున్నారన్నారు. కడుపుమంట బ్యాచ్ అందరికీ నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్మోహన్రెడ్డి సింహం లాంటి వ్యక్తి అని ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా పేదలకు ఇస్తానన్న పట్టాలను ఇస్తామని పేర్కొన్నారు. వైయస్సార్ ఆసరా పథకం ద్వారా సుమారు రూ 42 కోట్లు 18 వ తారీకు సాయం కాలం నాటికి ప్రతి మహిళకు వ్యక్తిగత ఖాతాలో జమ అవ్వడం జరుగుతుందన్నారు. అర్హత ఉంది టెక్నికల్ ఇబ్బందుల వలన ఏదైనా గ్రూపులకు మొదటి విడత రుణమాఫీ ఎకౌంట్లో జమ అవ్వకపోతే రెండు కలిపి ఎకౌంట్లో  వేయడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డులు కానీ రేషన్ ఆగిపోయినట్లు గాని ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే సచివాలయానికి వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. వాలంటీర్ల సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన వచ్చే విధంగా కృషి చేసిన నాయకుడు జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 8 లక్షల గ్రూపులకు రూ 60 49 కోట్లు అందించడం జరుగుతుందన్నారు. పారదర్శక పాలన అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతంగా సంతోషకరంగా ఉండాలని దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్ పి టి సి నురుకుర్తి రామకృష్ణ,  ఎంపిపి గోపిశెట్టి పద్మజా, వైస్ ఎంపీపీ బందిల వీరీష, మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను, ఆర్ డి ఓ చిన్ని కృష్ణ, డీఎస్పీలు భీమారావు, వెంకటేశ్వరరావు, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ చిన్న, గంగనాపల్లి ఉపసర్పంచ్ గీసాల శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు, వి ఆర్ వో లు ,వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
*అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి కన్నబాబు*
     గురువారం కాకినాడ గ్రామీణ మండలం రమణయ్యపేట ఎంపీడీవో కార్యాలయం దగ్గర 50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ శంఖుస్థాపన కార్యక్రమానికి
రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఉద్యాన, పట్టు, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,కాకినాడ గ్రామీణ మండలం జడ్పీటీసీ సభ్యులు ఎన్.రామకృష్ణ, కరప మండలం జడ్పీటీసీ వై సుబ్బారావు ముఖ్య అతథిగా పాల్గొని  శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.అనంతరం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట రాయుడుపాలెంలోని   గ్రామసచివాలయం-2 నూతన భవనాన్ని మంత్రి కన్నబాబు రిబ్బన్ కటచ్ చేసి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకే పాలన లక్ష్యానికి అనుగుణంగా  గ్రామ సచివాలయ శాశ్వత భవనాలను నిర్మించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న గ్రామ సచివాలయం, వాలంటరీ వ్యవస్థలు దేశంలోనే అరుదైన వ్యవస్థలని, ప్రతి గ్రామంలోను ప్రజల వద్దకే అన్ని వ్యవస్థలు, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయలతోపాటు రైతు భరోసా, బల్క్ మిల్క్ సెంటర్లు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ లకు  శాశ్వత భవన నిర్మాణపనులు చేపట్టడం జరిగిందన్నారు. ఇంకా మిగిలి ఉన్న రైతు భరోసా, గ్రామ సచివాలయం, బల్క్ సెంటర్లు, హెల్త్ క్లినిక్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఇందులో భాగంగా కాకినాడ గ్రామీణ మండలం రమణయ్యపేట రాయుడుపాలెంలో సుమారుగా 48 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన సచివాలయం భవనాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం శుభపరిణామమని మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ గ్రామీణ మండలం ఎంపీపీ గోపిశెట్టి పద్మజ, ఎంపీడీవో పీ.నారాయణ మూర్తి, ఇన్చార్జి తహసిల్దార్ వీ.మురార్జీ, ఇంజనీరింగ్ అధికారి కె.శ్రీనివాసు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comment here