Andhra PradeshEast GodavariNews

అమ్మవారికి గజమాలతొ అలంకరణ

అమ్మవారికి గజమాలతొ అలంకరణ

* కడియం నుండి వచ్చిన గజమాలలు
* గులాబీలతో ఒకటి, బంతిపూలతో మరొకటి

కోస్తా ఎన్ కౌంటర్ గోకవరం:  గజమాలలు కనువిందు చేశాయి…భక్తులు ఆశ్చర్యపోయే రీతిలో ఉన్నాయి.. చేసిన వారికి చేతులెత్తి మొక్కచ్చు..చేయించిన వారికి అభినందనలు తెలపొచ్చు..గోకవరం దేవిచౌక్ వద్ద అమ్మవారి దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి.. గురువారం వేకువజాము నుండి  ఆలయం వద్ద కోలాహలం ప్రారంభం అయింది.. కనకదుర్గ అమ్మవారిని అలంకరించడం, ఆలయ ప్రాంగణం పూలతో తీర్చి దిద్దటం చాలా అద్భుతంగా ఉంది..భక్తులు అమ్మవారి దర్శనం కోసం వేసి ఉండగా, రెండు గజమాలలు తీసుకుని ఆలయ కమిటీ సభ్యులు వచ్చారు. మొదటిది గులాబీలతో చేసిన గజామాల.. అత్యంత అద్భుతంగా ఉంది. రెండోది బంతిపూలతో చేసిన గజామాల.. చాలా గొప్పగా చేశారు. ఈ రెండు గజమాలలను ఆలయం బయట నుండి లోపలి అమ్మవారికి వేయటానికి గంట సమయం పట్టింది. భక్తులు గజమాలలను మోసుకుంటు రావటం, అమ్మవారికి అలంకరించడం ఆమోఘమని చెప్పొచ్చు. గజమాలలు వేస్తున్నారని తెలిసి రోడ్డు పై వెళ్లే ప్రయాణికులు లోపలికి వచ్చి చూశారు. పెద్ద పెద్ద గజమాలలను చూసిన భక్తులు వాహనాల్లో వెళ్తున్న భక్తులు చేతులెత్తి మొక్కుకున్నారు. ఈ గజమాలలను కడియం నుండి తీసుకువచ్చినట్లు కమిటీ నిర్వాహకులు చెప్పారు.. కింద నుండి మొదటి అంతస్తు లో ఉన్న అమ్మవారి వద్దకు మెట్ల పై గజమాలను మోసుకుంటు వెళ్లిన భక్తులు జై దుర్గ అంటూ నామస్మరణ చేసుకుంటూ వెళ్లారు. వేద పండితులు సీతారామాచార్యులు, వల్లూరి జగన్నాధ శర్మ, శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛరణ జరగగా, గజమాలలు అమ్మవారికి వేశారు.

Comment here