Andhra PradeshEast GodavariNews

అమ్మవారికి సూర్యప్రకాష్,అన్నపూర్ణ దంపతుల చిరు కానుక

అమ్మవారికి సూర్యప్రకాష్,అన్నపూర్ణ దంపతుల చిరు కానుక
* లక్ష రూపాయలతో స్టీల్ గేట్ ఏర్పాటు
* విజయవాడలో తయారీ
* అద్భుతంగా ఉందంటూ ప్రసంశలుకోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  మనస్ఫూర్తిగా చేసే పని పదిమంది మన్ననలు పొందుతుంది…ఇష్టంతో చేసిన కార్యం ఘనత వహిస్తుంది.. స్వార్థం లేకుండా చేసే ఉపకారం లో ప్రయోజనం ఉంటుంది.. పదిమందికి మేలు చేసే వ్యక్తిని భగవంతుడు చల్లగా చూస్తాడు…ఇలా చేసే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు.. ఆ కోవలోకి చెందిన వ్యక్తులే కంచర్ల సూర్యప్రకాష్, అన్నపూర్ణ దంపతులు… పేదలకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటారు.. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తమ వంతు కృషి చేస్తారు.. గోకవరం గ్రామానికి చెందిన కంచర్ల సూర్యప్రకాష్, అన్నపూర్ణ దంపతులు దేవిచౌక్ లోని అమ్మవారి ఆలయానికి సంబంధించి ప్రధాన గేట్ ని ఏర్పాటు చేశారు. 12 అడుగులు అడ్డం, 8 అడుగులు పొడవు ఉండేలా కొత్త ద్వారాన్ని ఏర్పాటు చేశారు.. ఇది పూర్తిగా స్టీల్ మెటీరియల్ తో తయారు చేయించారు. విజయవాడలో తమకు తెలిసిన వారితో ద్వారాన్ని చేయించారు.. అమ్మవారికి ఏర్పాటు చేసే ద్వారం అద్భుతంగా ఉండాలని, ఎంత ఖర్చు అయిన పర్లేదు అనే ఉద్దేశ్యంతో తయారు చేయించారు.. చాలా బ్రహ్మాండంగా ద్వారాన్ని రూపుదిద్దారు.. సుమారు లక్ష రూపాయల వరకు ఖర్చు చేయటం జరిగింది. దసరా ఉత్సవాలలో భాగంగా మొదటి రోజే ఆలయానికి వీటిని అమర్చారు. ట్రాలీ టైప్ గేట్ అవ్వటం వల్ల చాలా అందంగా ఉంది..రెండు వైపుల నుండి సగం సగం వరకు ట్రాలీ మాదిరిగా లాగితే సరిపోతుంది. తాళం వేసేప్పుడు రెండింటిని దగ్గరగా లాగితే సులువుగా ఉంటుంది. అమ్మవారికి ఎదురుగా గర్భ గుడిలోకి వెళ్లే ద్వారం వద్ద దీనిని ఏర్పాటు చేశారు. చక్కటి గేట్లు ఏర్పాటు చేసినందుకు ఆలయ కమిటీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కంచర్ల సూర్యప్రకాష్, అన్నపూర్ణ దంపతులు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తుంటారు. ఈ దసరా ఉత్సవాలలో అమ్మవారు తమకు అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు.

Comment here