Andhra PradeshEast GodavariNews

అమ్మవారికి 14 లక్షల తో అలంకరణ

అమ్మవారికి 14 లక్షల తో అలంకరణ

కోస్తాఎన్ కౌంటర్, గోకవరం:  మండలంలో దేవి చౌక్ లో వరాలిచ్చే అమ్మగా వెలసిన కనకదుర్గమ్మ దేవి నవరాత్రుల సందర్భంగా విజయదశమి పురస్కరించుకొని మండలంలో భక్తులు 14 లక్షల రూపాయల నోట్లతో అమ్మవారికి అలంకరించారు. 108  రకాల పిండివంటలతో నైవేద్యం పెట్టారు. గ్రామంలోని భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. భక్తులతో ఆలయమంతా కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకోవడానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాధ్, గోకవరం జడ్పిటిసి దాసరి శ్రీరంగ రమేష్, నాయకులు వరసాల ప్రసాద్, కర్రీ సూరారెడ్డి, సుంకర వీరబాబు, చింతల అనిల్, కార్యకర్తలు పాల్గొన్నారు,

Comment here