Andhra PradeshEast GodavariNews

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
– దేవీచౌక్ అమ్మవారిని దర్శించుకున్న ఆదిరెడ్డి దంపతులు
రాజమహేంద్రవరం సిటీ:
కనక దుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆదిరెడ్డి దంపతులు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) ఆకాంక్షించారు. దేవీనవరాత్రులు సందర్భంగా రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన దేవీచౌక్ త్రిపుర సుందరి అమ్మ వారిని ఆదిరెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక ప్రజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవీచౌక్ అంటే దేవీ నవరాత్రులకు పెట్టింది పేరని, ఘన చరిత్ర కలిగిన దేవీచౌక్ ఎంతో వైభవంగా నవరాత్రి వేడుకలు జరిగేవన్నారు. కరోనా కారణంగా ఆ స్థాయిలో వేడుకలు జరగడం లేదన్నారు. లోకం నుంచి కరోనా వైరస్ తొలగిపోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆదిరెడ్డి దంపతులు ఆకాంక్షించారు. అనంతరం 6వ వార్డు దుర్గాచౌక్, 46వ వార్డు ఆనందనగర్, లలితానగర్ 4వ వీధి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉ త్సవాల్లో పాల్గొని అమ్మ వారి ఆశీస్సులు పొందారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్, టీడీపీ రాష్ట్ర మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు ద్వారా పార్వతి సుందరి, ఆలయ కమిటీ సభ్యులు బత్తుల రాజేశ్వరరావు, బత్తుల ఈశ్వరావు, ఆశపు మల్లికార్జున రావు, ఎ సాంబ, భాస్కరరావు తదితరులు వారి వెంట ఉన్నారు.

Comment here