Andhra PradeshEast GodavariNews

అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే

అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే
కోరిన కోర్కెలు తీర్చే కనకదుర్గ అమ్మవారు

* గోకవరం దేవిచౌక్ లో దసరా ఉత్సవాలు
* భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం: అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని భక్తుల నమ్మకం.. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారు, గ్రామానికి రక్షణగా ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి అయ్యాయి..గోకవరం దేవిచౌక్ లోని కనకదుర్గమ్మ అమ్మవారి 19 వ శరన్నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభం అవుతున్నాయని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. 7 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని, భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు చేస్తున్నామని, భక్తులు అందరు మాస్కులు వేసుకుని రావాలని తెలిపారు. గత వారం రోజులుగా ఆలయ అలంకరణ పనులతో కమిటీ సభ్యులు బిజీగా ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆలయంలోకి అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక భావన కలిగే విధంగా తయారు చేశారు. గురువారం మొదటి రోజు అమ్మవారు భువనేశ్వరి దేవిగా దర్శనం ఇస్తారు. శుక్రవారం బాల త్రిపుర సుందరి దేవి గాను, శనివారం గాయత్రిదేవి గా, ఆదివారం ఉదయం లలితా త్రిపుర సుందరి దేవిగా, మధ్యాహ్నం అన్నపూర్ణా దేవిగా దర్శనం ఇస్తారు. సోమవారం శ్రీ మహాలక్ష్మి గా, మంగళవారం మహా సరస్వతీ దేవిగా, బుధవారం కనకదుర్గ దేవిగా, గురువారం మహిషాసురు మర్దినిగా, శుక్రవారం రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారని వేద పండితులు తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని, ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు, కుంకుమ పూజలు జరుగుతాయని వేద పండితులు తెలిపారు. 20 వ తేదీ బుధవారం అమ్మవారి ఊరేగింపు ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని సూచించారు.

Comment here