Andhra PradeshEast GodavariNews

అర్హులందరికీ ఇళ్ళు

అర్హులందరికీ ఇళ్ళు
పెంటపాడులో మాట్లాడుతున్న ఎంపీపీ దాసరి హైమావతి……
కోస్తా ఎన్‌కౌంటర్‌ పెంటపాడు : అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం పక్కా ఇళ్ళు నిర్మిస్తుందని ఎంపీపీ దాసరి హైమావతి అన్నారు. నవరత్నాలు ` అందరికీ ఇళ్ళు కార్యక్రమంలో ఇళ్ళు నిర్మించుకున్న లబ్ధిదారులకు జగనన్న పచ్చతోరణం కింద మండల కేంద్రమైన పెంటపాడులో మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంపీపీ దాసరి హైమావతి మాట్లాడుతూ ఇళ్ళస్థలాలు, ఇళ్ళు కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా మంజూరవుతాయన్నారు. ఇంటి స్థలం, ఇల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పరిసరాల్లో మొక్కల పెంచడం ద్వారా ఆక్సిజన్‌ సమృద్ధిగా అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ తాడేపల్లి సూర్యకళ, ఎమ్పీటీసీలు రెడ్డి సూరిబాబు, దేవబత్తుల నాగమణి, దయ్యం అవతార్‌, కట్టుబోయిన కృష్ణప్రసాద్‌, హౌసింగ్‌ ఏఈ శ్రీనివాస్‌, హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ జయరాజు తదితరులు పాల్గొన్నారు.

Comment here