Andhra PradeshEast GodavariNews

*అర్హులైన గిరిజనులకు అవకాశం కల్పించండి

*అర్హులైన గిరిజనులకు అవకాశం కల్పించండి
– చింతూరు ఐటిడిఏ పిఓ వెంకటరమణకు వేడుకోలు
– వ్యవధి ఐనా పర్వాలేదు ఆలోచించండి సారో
– దొంగల చేతికి మరలా తాళాలు అప్పగించొద్దు
– అక్రమ పాల కాంట్రాక్టర్ పై చర్యలు ఏవి…?
– గిరిజన సంఘం నాయకులు ఇర్పా.అజయ్
 కోస్తా ఎన్ కౌంటర్ ఎటపాక :మన్యం లో  జరుగుతున్న అంగన్వాడీ పాల సరఫరాలో భాగంగా అర్హులైన గిరిజనులకు కాంట్రాక్టర్ గా అవకాశం కల్పించాలని చింతూరు ఐటిడిఏ పిఓ ఆకుల.వెంకటరమణకు గిరిజన సంఘం నాయకులు ఇర్పా.అజయ్ కుమార్ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నారు.* వివరాలు లోకి వెళితే  రెండు నెలలుగా  చింతూరు, కూనవరం, ఎటపాక, వీ ఆర్ పురం మండలాలలో పిల్లలుకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీల కు, పాలు సరఫరా చేయకుండా ఇతర రాష్ట్రాలకు అంగన్వాడీ పాలను అమ్ముకుంటున్న వ్యక్తి ఆగస్టు 14 తేదీన రెవిన్యూ అధికారులకు అడ్డంగా దొరికాడు. అప్పటి నుండి అంగన్వాడీ కేంద్రాలలో పాలు సరఫరాను నిలిపి వేయడం జరిగింది.అక్రమాలు చేసి పట్టుబడిన వ్యక్తి పై కేసు నమోదు చేయడం జరిగింది.పాలు సరఫరా ను పూర్తిగా నిలిపివేయటం జరిగింది. అప్పటి నుండి చింతూరు పీ ఓ ఆకుల వెంకటరమణ ఆదేశాలు మేరకు   ఐ సీ డీ ఎస్ అధికారులు ద్వారా పాలు సరఫరా చేయడం జరిగింది. ఇది జరిగి నెల దాటిన కానీ నూతన గుత్తేదారుడుని నియిమించక పోవడం అంగన్వాడీ సిబ్బందికి ఇబ్బందికరంగా ఉందనీ చెప్పాలి. ఎటపాక మండలంలో నీ గుండాల కాలనీ గోడౌన్ లో నూతన గుత్తే దారుడిని నియమించే వరకు పాత గుత్తే దారుడు వాహనాలతో, అతని కూలీలతో పాలు సరఫరా చేస్తామని ఆకుల. వెంకటరమణ తెలిపారు.గతంలో కూడా కాలం చెల్లిన పాలును సరఫరా చేసి అక్రమాలు పాల్పడితే వెంటనే నూతన గుత్తే దారుడిని నియమించడం జరిగింది. కానీ ఇప్పుడు  నెల రోజులైనా గుత్తే దారుడుని నియమించక పోవడం ఏజెన్సీ ప్రజలుకు అర్థం కానీ విషయంగా మారింది . దినంతటికి కారకుడు అయినా పాత గుత్తే దారుడు  బినామీల పేర్లతో మరల పాలు కాంట్రాక్ట్ చేయాలనీ ప్రయత్నిస్తున్నాడనీ ఆరోపణలు వెళువెత్తుతున్నాయి. కనుక అతని బినామీల  పేర్లు పెట్టించి వారి ద్వారా అతని గోడౌన్ లో నే పాలు దింపించి మరల అంగన్వాడీ సెంటర్లకు పాలు సరఫరా చేయాలనీ ప్రయత్నిస్తున్నాడనీ విశ్వానియాసమాచారం . అలానే పాత గుత్తే దారుడికి మరల ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన బిడ్డలు పాలు అమ్ముకున్నందుకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావాలనీ ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.ఇప్పుడు పాలు సరఫరా చేయడానికి సమయం పట్టిన కానీ ఒక మంచి వ్యక్తిని పెడితే బావుంటుంది ప్రజలు కోరుకుంటున్నారు. కనుక మరల మళ్ళీ అతనికి కానీ అతని బినామీలకు కానీ పాలు సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చినట్టయితే అతనితో పాటు అతనికి సహకారం అందించిన ప్రతీ ఒక్కరి పైన కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంటుందనీ ఎటపాక గిరిజన సంఘం నాయకుడు ఇరపా. అజయ్ తెలిపారు . అలానే  అతని బినామీలకి కాంట్రాక్టు ఇచ్చినట్టయితే నాలుగు మండలాలలో మళ్ళీ అక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు . అలానే అతని వాహనాలు లేదా అతని దగ్గర పనిచేసే కూలీల ద్వారా పాలు సరఫరా చేయిస్తే మరల నాలుగు మండలాలలో అంగన్వాడీ పాలను అమ్ముకొవడమే కాకుండా అంగన్వాడీ పాలను ఇతర రాష్ట్రాలలో అమ్ముకుంటాడనీ  ఏజెన్సీ గిరిజన ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. కనుక ఏజెన్సీ ప్రాంతంలో సమయం గడిచిన కానీ ఒక మంచి గుత్తే దారుడు ను పెట్టి ఇకనుండి అయినా అంగన్వాడీ కేంద్రాలలో అక్రమాలు జరగకుండా అధికారుల పర్యక్షణలో జరగాలనీ ఏజెన్సీ వాసులు కోరుకుంటున్నారు.

Comment here