Andhra PradeshEast GodavariNews

అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీల లను  త్వరితగతిన నిర్మించాలి

అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీల లను  త్వరితగతిన నిర్మించాలి -మాసా రామ్ జోగి

రాజమహేంద్రవరం టౌన్,కోస్తా ఎన్ కౌంటర్:
రాజమహేంద్రవరం నగర మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్త్ కిషోర్ వారికి
రాజమహేంద్రవరం స్థానిక 49వ డివిజన్ సుబ్బారావు నగర్ మరియు సింహాచల నగర్ లలో అసంపూర్తిగా ఉన్న డ్రైన్ ల వలన మురుగు ఎక్కడికక్కడ ఉండటం వలన ప్రజలు దుర్గంధాన్ని భరించలేక పోతున్నారని అలాగే పందులు స్వైర విహారం చేస్తున్నాయని తద్వారా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని కావున  త్వరితగతిన ఆ డ్రైన్ లను నిర్మించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని అలాగే సుబ్బారావు నగర్ లో 92 మరియు 93 సచివాలయాలు దగ్గర క్వారీ గోతుల్లోకి మట్టి జారి అక్కడ ఉన్నటువంటి రక్షణ గోడ పడిపోవడం వల్ల పెద్ద పెద్ద విష సర్పాలు  వస్తున్నాయని అలాగే మురుగునీరు అంతా అక్కడే ఉండడం వల్ల సచివాలయాలకు వచ్చే ప్రజలు,మరియు అక్కడ నివాసం చేసే స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారని కమిషనర్ కు వినతిపత్రాన్ని సమర్పించారు.రామ్ జోగి మాట్లాడుతూ ఈ విషయం పై పరిశీలించి డ్రైన్లను నిర్మించి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ ఆశపు చిన సత్యనారాయణ, సోమరాజు, లోలుగు నాగరాజు , వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు.

 

Comment here