Andhra PradeshEast GodavariNews

ఆత్రేయపురం మండలం లో అన్ని పాఠశాల లో డీ వార్మింగ్ డే

ఆత్రేయపురం మండలం లో అన్ని పాఠశాల లో డీ వార్మింగ్ డే
కోస్తా ఎన్ కౌంటర్  ఆత్రేయపురం మండలం లోని అన్ని పాఠశాలలు, అంగనవాడీ కేంద్రాలలో చిన్నారులు, విద్యార్థులకు జాతీయ  డివార్మింగ్ డే  సందర్భంగా హెల్త్ సిబ్బంది, ఉపాధ్యాయుల సహకారంతో నులి పురుగుల నివారణ మాత్రలు ఆల్బెండజోల్ ఐపి 400 ఎంజి మాత్రలు పంపిణీ చేసారని మెడికల్ ఆఫీసర్లు డా.శ్రీనివాసవర్మ, డా.సునీత, ఎంపీడీఓ నాతి బుజ్జి, తాహశిల్దార్ రామకృష్ణ, ఎంఈఓ ప్రసాదరావు, అంగనవాడీ సూపర్ వైజర్ కుమారి తెలిపారు…ఈ సందర్భంగా హెల్త్ సిబ్బంది మాట్లాడుతూ  కడుపు లో నులిపురుగులు పెరిగితే రక్తహీనత కలుగుతుందనీ, అందువల్ల కలిగే  శారీరక బలహీనత విద్యార్థుల మానసిక వికాసాన్ని కూడా తగ్గిస్తుందనీ అందువల్ల. విద్యార్థులు పౌష్టికాహారంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలనీ అన్నారు…ఈ కార్యక్రమం లో అందరు హెల్త్ సిబ్బంది, అంగనవాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Comment here