Andhra PradeshEast GodavariNews

ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దుతాం

ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దుతాం
… నూటికి నూరుశాతం వ్యాక్సినేషన్ చేయించాలి మండల అభివృద్ధి అధికారి పాఠం శెట్టి సత్యనారాయణ మూర్తి
కోస్తా ఎన్ కౌంటర్, సర్పవరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలన్నింటినీ అర్హులైన వారందరికీ అందిస్తూ, పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రమణయ్యపేట స్పెషల్ ఆఫీసర్ , మండల అభివృద్ధి అధికారి పాఠం శెట్టి నారాయణ మూర్తి పేర్కొన్నారు. శుక్రవారం నాడు కాకినాడ రూరల్ మండలం లోని రమణ పేట గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల అభివృద్ధి అధికారి పాఠం సత్యనారాయణమూర్తి పాల్గొని మాట్లాడుతూ పంచాయతీ గ్రామ సభలు గ్రామ పెద్దలు పేర్కొన్న సమస్యలన్నిటిని త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో  అధికగా ఉన్న పందుల బెడద పై  గ్రామస్తులు ఫిర్యాదు ఎక్కువ రావడంతో స్పందించిన స్పెషలాఫీసర్ గతంలో పందుల  తరలించడం జరిగిందని, అప్పుడు ఏ గ్రామస్తులు కూడా పంచాయతీ అధికారులకు వెన్నుదన్నుగా నిలబడలేదని పందుల పెంపకం దారులు కేసులు వేసి బెదిరింపులకు గురి చేశారని పేర్కొన్నారు. పందుల పెంపకం దారులకు పంచాయతీ తరఫునుండి నోటీసులు జారీ చేయడం జరుగుతుందన్నారు. కుక్కల పై కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మాత్రమే చేయగలమని వాటిని త్వరలోనే అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందే విధంగా వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా పారిశుధ్యం పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించి ఆదర్శవంతమైన పంచాయతీగా తీర్చిదిద్దడంలో కృషి చేయాలన్నారు. కుటుంబ సభ్యుల సమగ్ర దర్యాప్తులో భాగంగా ప్రతి ఒక్కరు డేటా ఎంట్రీ ని చెయ్యాలని వాలంటీర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఇంచార్జ్ కార్యదర్శి దవులూరి రమణ, మూర్తి పబ్లిక్ స్కూల్ అధినేత   పాలిక నరసింహా మూర్తి , కేశవ, వి ఆర్ వో లు నున్న సత్యనారాయణ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Comment here