Andhra PradeshEast GodavariNews

*ఆర్టీఐ జాతీయ వారోత్సవాలు అధికారికంగా నిర్వహించాలని కలెక్టర్ కు సీసీఆర్ సంస్థ వినతిపత్రం*

*ఆర్టీఐ జాతీయ వారోత్సవాలు అధికారికంగా నిర్వహించాలని కలెక్టర్ కు సీసీఆర్ సంస్థ వినతిపత్రం*
కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ అనే మానవ హక్కుల సంస్థ జాతీయ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు విశాఖ జిల్లా సీసీఆర్ సంస్థ సభ్యులు జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున్ ని కలిసి ఆర్టీఐ 17 వ జాతీయ వారోత్సవాలు అధికారికంగా నిర్వహించాలని కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు..
గ్రామ స్థాయి నుండి పట్టణ ప్రాంతాలు వరుకు అన్ని ప్రభుత్వ కార్యలయాల్లో తప్పనిసరిగా ఆర్టీఐ వారోత్సవాలు అధికారికంగా నిర్వహించేటట్లు ఆదేశాలు జరిచెయ్యవలసిందిగా కోరారు..సానుకూలంగా స్పందించిన కలెక్టర్ డా.మల్లికార్జున సంబంధిత డిఆర్వో కి అధికారికి వినతిపత్రం పంపించారు..
ఈ సందర్భంగా సీసీఆర్ జిల్లా కన్వీనర్ చల్లా చంద్రశేఖర్, విశాఖ జిల్లా ప్రెస్ అండ్ మీడియా ఇంఛార్జి కసిపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సిఐసి  అన్ని రాష్ట్రాల సిఐసి మరియు సిఎస్ లకు ఆర్టీఐ జాతీయ వారోత్సవాలు  అధికారికంగా జరపాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చెయ్యాలని జిల్లా కలెక్టర్ గార్కి వినతిపత్రం అందజేయడం జరిగింది.. దీనికి కలెక్టర్ డా.మల్లికార్జున సానుకూలంగా స్పందించిన తీరు అభినందనీయమని అన్నారు..సామాన్య ప్రజలకు చెందాల్సిన హక్కులు, రావలసిన పథకాలు,ప్రభుత్వాలు ఖర్చు పెట్టాల్సిన నిధులు తదితర విషయాలు సమగ్రంగా తెలియపరచాలని, సమాచార హక్కు చట్టం పటిష్ఠంగా అమలు పరచాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉన్నతాధికారులదే అని స్పృష్టం చేశారు..భారత ప్రభుత్వం సహ చట్టం వారోత్సవాలు కు నిధులు కూడా కేటాయించిందని, ప్రతి మారుమూల గ్రామం వరుకు న్యాయం పారదర్శకంగా జరగాలని కోరారు..ఆర్టీఐ జాతీయ వారోత్సవాలులో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులను భాగస్వామ్యం చెయ్యాలని కోరారు…కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు మంచికట్ల అనిల్ కుమార్ జాతీయ స్థాయిలో ఆర్టీఐ పటిష్టంగా అమలు జరిగేలా కృషి చేస్తున్నారని అన్నారు..ఈ కార్యక్రమంలో జిల్లా సీసీఆర్ సభ్యులు డీఎస్.కిరణ్,జామి శివాజీ, సుంకర జనార్దన్,బొబ్బిలి అప్పలనాయుడు, కిల్లో బాబూరావు,వేనికల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు..

Comment here