Andhra PradeshEast GodavariNews

ఆర్ టి సి పిటిడి కార్మిక, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఆర్ టి సి పిటిడి కార్మిక, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. కామనురు.శ్రీనివాసులురెడ్డి
 ప్రభుత్వంలో చేర్చుకున్నామనే కారణంతో ఉద్యోగుల హక్కులను తొలగించడాన్ని ఆపాలి. ఈరోజు  సి ఐ టి యు కడప జిల్లా కార్యాలయంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టొద్దని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనురు శ్రీనివాసులురెడ్డి ,జిల్లా ప్రదానకార్యదర్శి బి మనోహర్, జిల్లా కార్యదర్శి ఏ రామ్మోహన్ సిఐటియు జిల్లా నాయకులు ,     జి రాజమణి ,నాగేంద్ర పాల్గొన్నారు.  కామనురు శ్రీనివాసులు రెడ్డి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ
పి.టి.ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ తరపున దఫదఫాలుగా యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్రాత పూర్వకంగా ఇచ్చాము. కార్మిక, ఉద్యోగ సంఘాలు/ అసోసియేషన్లతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని ఫెడరేషన్ ఏడాది కాలంగా కోరుతున్నది. కార్మిక, ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు ఐక్యతకు యత్నాలు చేసిన తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని ఆగస్టు 16న వివిధ అసోసియేషన్లతో చర్చలు జరిపారు. చర్చల్లో యాజమాన్య వాదనలు ప్రముఖంగా వినిపించారు. | అనంతరం ప్రమోషన్లు, బదిలీలు, కాంట్రాక్టు డ్రైవర్ కండక్టర్ల రెగ్యులర్, బ్రెడ్ విన్నర్ స్కీమ్లో నియామకాలు వంటి సమస్యలు పరిష్కారానికి యాజమాన్యం పూనుకొన్నది. చర్చలు ప్రక్రియను కొనసాగించాలని, ఉద్యోగ, కార్మిక సంఘాలు / అసోసియేషన్లు ఇచ్చిన సమస్యలను చర్చించి పరిష్కరించాలని ఎస్.డబ్ల్యు. ఎఫ్ సీఐటీయూ జిల్లా కమిటీ కోరుతున్నది.
ఎపిఎస్ ఆర్టీసి చట్టం 2019లో ఉద్యోగుల బకాయిలు చెల్లింపుకు నిర్దిష్టమైన క్యాలెండర్ ఇచ్చారు.
 ఆ చెల్లింపులు కోసం ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేటికీ చెల్లింపులు జరగలేదు. 2020 జనవరి 1వ తేదీనుండి పి.టి.డిలో చేర్చుకున్నప్పటికీ | నేటికీ మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే వివిధ సౌకర్యాలను హెచ్.ఆర్) అమలు చేయడం లేదు. మెడికల్ అన్ఫెట్ అయిన వారికి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న విధంగా ప్రభుత్వ పెన్షన్ చెల్లింపు, వారసులకు ఉద్యోగం వంటి అంశాలు పి.టి.డి ఉద్యోగులకు అమలు కావడం లేదు. ఈ అంశంలో ప్రభుత్వంలో వున్న విధానాన్ని పిటిడీలో మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగులకు వర్తింప చేయాలని తొలి విలీన కమిటీ నొక్కి చెప్పింది.
ఈ కాలంలో పి.టి.డీలో చేర్చుకున్న ఉద్యోగులకు ఉన్న వివిధ చట్టపరమైన సౌకర్యాలు, హక్కులు తగ్గిపోతున్నాయి. ఇ.ఎస్.ఐ.సి చట్టం ద్వారా వచ్చిన మెడికల్ సౌకర్యం స్థానంలో ఉద్యోగుల నెలవారీ జీతాల నుండి రికవరీతో ఇ.హెచ్.ఎస్ను తెచ్చారు. గ్రాట్యుటీ తగ్గింపు వంటి అంశాలలో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగింది. ఈ క్రింది పేర్కొన్న సమస్యలపై చర్చించి తక్షణం | పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఎస్.డబ్ల్యు. ఎఫ్  సీఐటీయూ కోరుతున్నది.
ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ : ప్రభుత్వ పెన్షన్ ఉద్యోగుల ప్రాథమిక హక్కువంటిదని గౌ॥ సుప్రీమ్ కోర్టు పేర్కొన్నది. విలీనంతో వారు తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల ఆర్టీసీలలో ఉద్యోగులు |ప్రభుత్వ పన్షన్ చెల్లింపు, వారసులకు ఉద్యోగం వంటి అంశాలు పి.టి.డి ఉద్యోగులకు అమలు కావడం లేదు. ఈ అంశంలో ప్రభుత్వంలో వున్న విధానాన్ని పిటిడీలో మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగులకు వర్తింప చేయాలని తొలి విలీన కమిటీ నొక్కి చెప్పింది.
ఈ కాలంలో పి.టి.డీలో చేర్చుకున్న ఉద్యోగులకు ఉన్న వివిధ చట్టపరమైన సౌకర్యాలు, హక్కులు తగ్గిపోతున్నాయి. ఇ.ఎస్.ఐ.సి చట్టం ద్వారా వచ్చిన మెడికల్ సౌకర్యం స్థానంలో ఉద్యోగుల నెలవారీ జీతాల నుండి రికవరీతో ఇ.హెచ్.ఎస్ను తెచ్చారు. గ్రాట్యుటీ తగ్గింపు వంటి అంశాలలో ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగింది. ఈ క్రింది పేర్కొన్న సమస్యలపై చర్చించి తక్షణం పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఎస్.డబ్ల్యు.ఎఫ్ కోరుతున్నది.
 ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ : ప్రభుత్వ పెన్షన్ ఉద్యోగుల ప్రాథమిక హక్కువంటిదని గౌ॥ సుప్రీమ్ కోర్టు పేర్కొన్నది. విలీనంతో ప్రభుత్వ పెన్షన్ వస్తుందని ఉద్యోగులు విలీనాన్ని ఆహ్వానించారు. తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల ఆర్టీసీలలో ఉద్యోగులు | పెన్షన్ పొందుతున్నారు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు డిపార్టుమెంట్లుగా నడుపుతున్న 16 ఆర్టీసీలలో ప్రభుత్వ పెన్షన్ అమలు చేస్తున్నారు. ఈ సెప్టెంబర్ నుండి రిటైర్ మెంట్లు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఎస్.ఆర్.బి.ఎస్ బెనిఫిట్ (పెన్షన్) ఇకపై రిటైర్ అయ్యేవారికి నిలిపి వేశారు. ప్రభుత్వ పెన్షన్ ఆర్టిసి పిటిడి ఉద్యోగుల హక్కు దానిని పరిష్కరించాలి.
గ్రాట్యుటి: 2020 జనవరికి ముందు గ్రాట్యుటీ చెల్లింపుపై సీలింగ్ లేదు. నెలకు 26 రోజులుగా వుండే భాగహార ఫార్ములాను 30కి | పెంచారు. పి.టి.డి ఉద్యోగులకు అనేక సం॥లుగా ఎస్.డబ్ల్యు. ఎఫ్ కోరుతున్న విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యుత్తు ఉద్యోగులకు ఉన్న డెత్ గ్రాట్యుటీని అమలు చేయటం లేదు. 2020 జనవరి తర్వాత రిటైరైన వారికి కేంద్ర గ్రాట్యుటి చట్టం వర్తించే వారికి కూడా రూ.12 లక్షలు సీలింగు పెట్టారు. వివిధ రాష్ట్ర ఆర్టీసీలలో అమలవుతున్న విధంగా రూ.20 లక్షల సీలింగ్ను ఉంచి, డెత్ గ్రాట్యుటీ విధానాన్ని అమలు చేయాలి. సిఎఫ్ఎంఎస్ ద్వారా 12లక్షలు మాత్రమే చెల్లిస్తే, సంస్థనిధుల నుండి మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. | స్కేళ్ళు మ్యాచింగ్, పిఆర్సి అమలు : ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కంటే పి.టి.డి ఉద్యోగులకు 25% వేతనాలు తక్కువ వున్నాయి. పిటిడి ఉద్యోగుల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల స్కేళ్లతో మ్యాచింగ్ చేస్తామని వివిధ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పి.ఆర్.సి ఫిట్మెంట్ వ్యత్యాసాన్ని పిటిడి ఉద్యోగులకు అమలు చేస్తామని స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి పరిష్కారంతో ఇది ముడిపడి వుంది. పిటిడి ఉద్యోగులు 2021 ఏప్రిల్ నుండి న్యాయంగా రావాల్సిన వేతన ఒప్పందాన్ని కూడా విలీనంతో కోల్పోయారు. ఈ నష్టాన్ని కూడా పిటిడి ఉద్యోగులకు సర్దుబాటు చేయాలి. తక్షణం ప్రభుత్వ ఉద్యోగుల పి.ఆర్.సిని ప్రకటించి అమలు చేయాలి. పిటిడి ఉద్యోగుల స్కేళ్ళ మ్యాచింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి.
 2017 వేతన బకాయిలు – – ఐదు సంవత్సరాల లీవ్ ఎన్ క్యాష్ మెంట్ల చెల్లింపులు : 2017 వేతన బకాయిలు చెల్లించక పోతే ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి లోనవుతారని ఎపిఎస్ఆర్టీసి చట్టం 2019లో పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని లేకపోతే సిఐటియు , ఏ ఐ ఆర్ టి డబ్ల్యూ ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా  ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కామనురు.శ్రీనువాసులురెడ్డి. బి.మనోహర్ .ఏ. రామమోహన్ ,రాజమని నాగేంద్రా పాల్గొన్నారు .

Comment here