Andhra PradeshEast GodavariNews

ఇంటికి గృహలక్ష్మి ఇల్లాలు

ఇంటికి గృహలక్ష్మి ఇల్లాలు
` ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం మున్సిపల్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందిస్తున్న ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ…..
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : ింటికి గృహలక్ష్మి ఇల్లాలు అని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద అర్బన్‌ హౌసింగ్‌ స్కీమ్‌ లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ నాడు మహానేత వైఎస్సార్‌, నేడు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న కాలంలో తాను ఎమ్మెల్యేగా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆక్రమణలో ఉన్న 650 ఎకరాల విమానాశ్రయ భూములను స్వాధీనం చేసుకుని ఆ స్థలంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు కట్టడంతో పాటు పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్‌రెడ్డికే దక్కేతుందన్నారు. రాష్ట్రంలో 31లక్షల మందికి ఇళ్ళు, ఇంటి స్థలం ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అని కొనియాడారు. దీన్ని కొంతమంది వ్యక్తులు మోకాలొడ్డుతూ అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించి ఇంటి ఇల్లాలి పేర్న ఇంటి పట్టా, ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం తధ్యమన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. దీన్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ బి.బాలస్వామి, అసిస్టెంట్‌ కమిషనర్‌ సృజన, హస్త కళల కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ మానికొండ వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వైసీపీ పట్టణాధ్యక్షుడు గుండుబోగుల నాగు, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌లు కర్రి భాస్కరరావు, బొడ్డు సాయిబాబా, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బోళెం రామలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు నేదునూరి గంగాధర్‌, కొలుకులూరి ధర్మరాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

Comment here