Andhra PradeshEast GodavariNews

ఇద్దరు దొంగలు అరెస్టు

ఇద్దరు దొంగలు అరెస్టు
విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న రూరల్‌ సీఐ రవికుమార్‌….
పోలీస్‌ సిబ్బందికి రివార్డులను అందజేస్తున్న సీఐ రవికుమార్‌……
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : పలు ఏటీఎంల వద్ద నగదు విత్‌డ్రా చేసుకునేందుకు వచ్చిన వారికి మాయమాటలు చెప్పి వారి కార్డుల నుంచి నగదు దోచుకుంటున్న ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రూరల్‌ సీఐ వి.రవికుమార్‌ తెలిపారు. సోమవారం స్థానిక రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్‌ సీఐ రవికుమార్‌ మాట్లాడుతూ మండల కేంద్రమైన పెంటపాడు గాంధీబొమ్మ సెంటర్‌లోని ఏటిఎం వద్దకు గత నెల 2వ తేదిన బర్రే వీరరాఘవమ్మ అనే మహిళ వచ్చిందని, డబ్బులు తీసే సమయంలో మాయమాటలు చెప్పి ఆమె కార్డును మార్చి రూ.20వేలను కాజేశారన్నారు. ఆమెఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గుర్తు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పెంటపాడు ఎస్సై చంద్రశేఖర్‌ ప్రత్తిపాడు గ్రామ శివార్లలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఏటీఎం చోరీ కేసు బయటపడిరదన్నారు. నిందితుల్లో ఒకడైన మైలవరపు రాజేష్‌ విలాసాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడుతున్నాడన్నారు. ఇతనిపై ఉభయగోదావరి జిల్లాల్లో 11 కేసులు ఉన్నాయన్నారు. రాజేష్‌కు రెండు నేరాల్లో సహకరించిన మరో వ్యక్తి షేక్‌ సైదాలీని అరెస్టు చేశామన్నారు. ఇరువురి వద్ద నుంచి రూ.2లక్షల నగదు, 100 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇరువురిని కోర్టుకు తరలించినట్లు తెలిపారు. కాగా, కేసును ఛేదించడంలో ప్రతిభకనబర్చిన ఏఎస్సై స్వామి, హెచ్‌సీ వెంకటేశ్వరరావు, పి.శ్రీనివాసరావు, గంగాధర్‌, ఎ.దుర్గాప్రసాద్‌, హోం గార్డు వెంకటేశ్వరరావులకు సీఐ చేతుల మీదుగా రివార్డులను అందజేశారు.

Comment here