Andhra PradeshEast GodavariNews

ఇళ్ళను అడ్డుకున్న ఘనత వారిదే…!

ఇళ్ళను అడ్డుకున్న ఘనత వారిదే…!
` ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ

కోస్తా ఎన్‌కౌంటర్‌ తాడేపల్లిగూడెం : న్యాయ వ్యవస్థను మేనేజ్‌ చేస్తూ పేదల ఇళ్ళను అడ్డుకున్న ఘనత వారికే దక్కుతుందని ప్రభుత్వ హామీల అమలు కమిటి చైర్మన్‌, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆదివారం స్థానిక తన క్యాంపు కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొట్టు మాట్లాడుతూ రాష్ట్రంలో 31లక్షల మంది కి, నియోజకవర్గంలో పది వేల మంది పేదలకు ఇళ్ళు సమకూరుతుంటే ఎంతో ఆనందపడ్డానని, టీవల కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆవేదనకు గురయ్యానన్నారు. టీడీజీ, జనసేన పార్టీలు కోర్టులను అడ్డం పెట్టుకుని ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు అని, అటువంటి ఇల్లాలి పేర్న ఇంటి పట్టాలు ఇవ్వడం తప్పా ? అని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిందని, త్వరలోనే అనుకూలమైన తీర్పు వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లబ్ధిదారులెవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ఆ రెండు పార్టీలకు త్వరలోనే కనువిప్పు కలుగుతుందన్నారు.

 

Comment here