Andhra PradeshEast GodavariNews

ఈతకోటలో రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసిన చిర్ల..

ఈతకోటలో రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసిన
చిర్ల..
కోస్తా ఎన్ కౌంటర్, రావులపాలెం మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో పెద్ద చెరువు గట్టు వద్ద నూతనంగా నిర్మాణం చేపట్టనున్న రైతు భరోసా కేంద్రానికి సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చేతులు మీదుగా శంకుస్థాపన చేశారు ప్రభుత్వం సుమారు ఇరవై ఒకటి లక్షల ఎనబై వేల రూపాయలతో నిర్మిస్తున్న భవనానికి వేద మంత్రాలతో పూజా కార్యక్రమాన్ని చేపట్టి కొబ్బరికాయ కొట్టి జగ్గిరెడ్డి శంకుస్థాపన నిర్వహించారు ఈ సందర్భంగా చిర్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి పనులను నిర్మిస్తున్నారన్నారు
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యర్రంశెట్టి సుబ్బలక్ష్మి,  ఎంపీటీసీలు బొరుసు సీతారత్నం, వత్సవాయి హరిబాబు,ఉప సర్పంచ్ ఏనుగుపల్లి నాగార్జున, వైసీపీ నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, యర్రంశెట్టి కాళీకృష్ణ, బొరుసు గోవిందు,మాజీ ఎంపీటీసీ గండ్రో తు రాజు,యర్రంశెట్టి నాగేశ్వరరావు(బుజ్జి),పంచాయతీ కార్యదర్శి మహ్మద్ అన్వర్, సత్తిరాజు, సచివాలయం ఉద్యోగులు, గ్రామ వాలంటిరీలు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Comment here