Andhra PradeshEast GodavariNews

ఉప్పలపాడులో ఘనంగా చండీహోమం

ఉప్పలపాడులో ఘనంగా చండీహోమం
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి : గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామ జనసేన పార్టీ కి చెందిన తమటం నాగేంద్ర స్వగృహం వద్ద గణపతి హోమం,చండీ హోమం నిర్వహించారు.తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు చింతా సుబ్రహ్మణ్యశర్మ (ప్రసాద్), ద్వారకా తిరుమల దేవస్థానం పండితులు రఘురామ శర్మ, రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో ఈ హోమాలు నిర్వహించారు. ఉప్పలపాడు జనసేన తమటం నాగేంద్ర కుమార్ దంపతులు పీటలమీద కూర్చుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ హోమ కార్యక్రమాల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన పార్టీ ఇన్చార్జి పాఠంశెట్టి సూర్య చంద్ర దంపతులు  పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చిన్నారులకు విద్యాబుద్ధులు కలిగించాలని అందరూ ఆయురారోగ్యాలతో  అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ హోమం నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమంలో భవానీలు,భక్తులు పాల్గొని తీర్ధ ప్రసాదములు స్వీకరించారు.

Comment here