Andhra PradeshEast GodavariNews

ఎంపీపీకి అభినందనలు తెలిపిన పార్టీ నేతలు

ఎంపీపీకి అభినందనలు తెలిపిన పార్టీ నేతలు
కోస్తా ఎన్ కౌంటర్ కాకినాడ రూరల్:ఇటీవల రూరల్ ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన గోపిశెట్టి పద్మజను కరప ఎంపీపీ శ్రీలక్ష్మి సత్తిబాబు,జడ్పిటిసి యాళ్ళ సుబ్బారావు బుధవారం కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ ఎంపీపీ నివాసంలో  కలుసుకుని అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ పద్మజ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎంపీపీగా గెలిపించినందుకు రూరల్ మండలం ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.అలాగే గ్రామాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానన్నారు.పార్టీలో నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగదని తెలియజేయడానికి ఇదే నిదర్శనం అని,మంత్రి కురసాల కన్నబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.అనంతరం అంగన్వాడిలు, వెండి బంగారం డైమండ్ వర్తక సంఘం అధ్యక్షుడు అనిశెట్టి రామకృష్ణ, వైసిపి నాయకులు పుల్ల కోటేశ్వరరావు కలుసుకుని అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల అధ్యక్షుడు కోటిపల్లి శ్రీనివాస్, కొవ్వాడ సర్పంచ్ తోటకూర శ్రీనువాస్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ వరసాల జాన్ ప్రభాకర్, వేపకాయల పాలెం ఎంపిటిసి ఎం. భాస్కర్, నక్కా సత్తిబాబు, గరగ ప్రభాకర్ రావు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comment here