Andhra PradeshEast GodavariNews

*ఎంబీ ఆసుపత్రిలో అరుదైన శస్ర్త చికిత్స…*

*ఎంబీ ఆసుపత్రిలో అరుదైన శస్ర్త చికిత్స…*
*మహిళా కడుపులో ఉన్న 9 కిలోల కణితి తొలగింపు*
కోస్తా ఎన్ కౌంటర్    రావుపాలెంలోని జాతీయరహదారి చెంతన  హెచ్‌పీ గ్యాస్‌ కంపెనీ సమీపంలో ఉన్న ఎంబీ ఆసుపత్రిలో వైద్యులు అనూషరెడ్డి,
 సందీప్‌రెడ్డిలు అరుదైన ఆపరేషన్‌ చేశారు.54 ఏళ్ల మహిళ కడుపులో నుంచి ఏకంగా 9కిలోల  కణితిని విజయవంతంగా తొలగించారు. కొన్ని రోజుల కిత్రం
రామతులసి అనే  మహిళ కడుపులో  నొప్పితో పాటు నడిచినా, పడుకున్నా చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. దీంతో ఆసుపత్రికి వచ్చిన ఆమెను వివిధ టెస్టులు చేసిన డాక్టర్లు కణితి ఉన్నట్లు గుర్తించారు. ప్రసూతి మరియు స్ర్తీల వ్యాధి నిపుణులు అనూష, ఆర్థో ఎముకల వైద్యనిపుణులు సందీప్‌ వైద్య బృందం ఆమెకు శస్ర్త చికిత్స  చేసి కణితిని తొలగించారు. అనంతరం రోగి ఆరోగ్యంగా ఉన్నట్లు గురువారం నాడు డాక్టర్లు తెలిపారు. శస్ర్త చికిత్స విజయవంతం కావడం పట్ల రామతులసి బంధువులు వైద్యులు అనూష, సందీప్‌లను  కుటుంబ సభ్యులు అభినందించారు.

Comment here