Andhra PradeshEast GodavariNews

ఏరియా ఆసుపత్రి లో  ఆకస్మిక తనిఖీలు చేసిన ఐటిడిఎ పిఓ

ఏరియా ఆసుపత్రి లో  ఆకస్మిక తనిఖీలు చేసిన ఐటిడిఎ పిఓ
పారిశుద్ధ్య నిర్వహణ పై తీవ్ర ఆగ్రహం
ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గైర్హాజరు ఆగ్రహం
కోస్తా ఎన్ కౌంటర్ , రంపచోడవరం :  ఏజెన్సీలోని ప్రభుత్వ ఆసుపత్రుల లో పారిశుధ్యంపై అలసత్వం వహిస్తే సంబందిత వైద్యాధికారు లు , పారిశుద్ధ్య సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య హెచ్చరించారు. గురువారం స్ధానిక ఏరియా ఆసుపత్రిని రంపచోడవరం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి ఆకస్మికంగా  తనిఖీచేశారు. పిఓ తనిఖీ చేస్తున్న సమయంలో ఆసుపత్రిలో సూపరింటెండెంట్ కార్తీక్ అందుబాటులో లేకపోవడంతో గైర్హాజరు కు గల కారణాలు అడిగి తెలుసుకన్నారు.  ఏరియా ఆసుపత్రిలోని రోగులకు సంబందించిన మరుగుదొడ్లు డ్రైనేజి, టి.బి., హెచ్.ఐ.వి. రక్త పరీక్షా కేంద్రాన్ని కరోనా వ్యాధిగ్రస్తులకు కొత్తగా నియమిస్తున్న క్యూబిక్వీన్స్ షెడ్లను, అదేవిదంగా రోగులకు సంబందించిన గతంలో నిర్మించిన డైనింగ్ హాల్ ను రోగులకు వంటలు వండే వంట షెడ్లను ప్రాజెక్టు అధికారి ఒక్కొక్కటి చొప్పున క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు సంబందించిన మరుగుదొడ్లు, పోస్టుమార్టం రూము అపరిశుబ్రంగా ఉండటం తో  ఆసుపత్రి  పారిశుద్ధ్య నిర్వహణ సూపర్ వైజర్ మంగా తమ్మన్న కుమార్ పై  ప్రాజెక్టు అధికారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. డ్రైనేజి సిస్టంలో మురుగు నీరు నిలవ ఉండడం వలన అక్కడ దోమల  లార్వా తయారై క్రిములు నీటిలో పైకి తేలుతుండటం పై జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ తో పోన్ లో మాట్లాడారు దీంతో  ఆయనవెంటనే ఏరియా  ఆసుపత్రికి చేరుకుని తక్షణమే  చర్యలు చేపడతామని పిఓ కు తెలిపారు.   అదేవిదంగా పోస్టుమార్టం రూము వరండాలో ఈగలు, చీమలు ఎక్కువగా ఉండడం వలన ఆసుపత్రికి  వచ్చే రోగులు  పలు రకాల  రోగాలకు గురి అయ్యే అవకాశం ఉందని తక్షణమే  ఈరోజు మూడు గంటల లోపు డ్రైనేజి మరుగుదొడ్లు పోస్టుమార్టం రూము, ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న చెత్తను వెంటనే తొలగించాలని లేని పక్షంలో ఆసుపత్రికి సంబందించిన పారిశుధ్య కంట్రాక్టర్ ను తొలగించడం జరుగుతుందని  ప్రాజెక్టు అధికారి హెచ్చరించారు. అదేవిదంగా మరుగుదొడ్లు లోకి వెళ్లి వచ్చిన వెంటనే వాష్ బేసిన్  లోనుంచి నీరు కాళ్ళపై పడుతుండటాన్ని  పి.ఒ. గమనించి  వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు.  అదేవిదంగా ఏరియా ఆసుపత్రి 100 పడకలకు సంబందించిన నూతన భవన పనులు వేగవంతంగా పనులు పూర్తిచేసి ఆసుపత్రి  అధికార్లకు అందించాలన్నారు. అదేవిదంగా టి.బి., హెచ్.ఐ.వి., ఎ.ఆర్.టి. రక్తపరీక్ష కేంద్రాన్ని పి.ఒ. పరిశీలించి ఏజెన్సీలో ఎంత మంది పేషెంట్లు ఉన్నది ప్రతినెల రోగులకు మందులు ఏవిదంగా సరఫరా చేయుచున్నది సంబందిత అధికార్లను పి.ఒ. అడిగి తెలుసుకున్నారు. అదేవిదంగా కరోనా అత్యవసర కేసులు పేషెంట్లకు బెడ్ లు ఏర్పాటుచేసేవిదంగా క్యూబిక్వీన్స్ షెడ్ లను ఏ విదంగా నిర్మించుచున్నది, అన్ని షెడ్లకు మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్  ఏవిదంగా ఏర్పాటుచేయుచున్నది తదితర వివరాలను పి.ఒ. అడిగితెలుసుకున్నారు. రోగులకు వండే వంటషేడ్ల చుట్టుపక్కల పరిశుబ్రంగా ఉంచాలని  సంబందిత వైద్యాదికారులను పి.ఒ. ఆదేశించారు. అదేవిదంగా ఆసుపత్రికి సంబందించిన జనరేటర్లు ఎప్పటికప్పుడు రన్నింగ్ లో పెట్టుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు.  గత నెలలో ఇదే ఆసుపత్రిలో   గంటన్నర  పాటు కరెంటు పోవడంతో జనరేటర్ పనిచేయని కారణంగానే చిన్నారి మరణించినట్లు ఈ ఆసుపత్రి పై లు ఆరోపణలు వచ్చాయి.  అదేవిదంగా ఆసుపత్రిలోనికి వచ్చే మోటార్ సైకిల్స్, కార్లకు ఒక భారీ గేటు ఏర్పాటుచేసి వాహనాలకు పార్కింగ్ స్ధలం ఏర్పాటుచెయ్యాలని సంబందిత వైద్యాదికారులను పి.ఒ. ఆదేశించారు. ప్రతిరోజూ ఆసుపత్రి చుట్టుపక్కల డ్రైనేజి మరుగుదోడ్లు శుభ్రం  చేసి వాటిని ఫోటోలు తీసి ప్రతిరోజూ సమర్పించాలని సంబందిత అధికార్లను పి.ఒ. ఆదేశించారు

Comment here