Andhra PradeshEast GodavariNews

ఏసీబీ వల లో అవినీతి చేప..

ఏసీబీ వల లో అవినీతి చేప..

కోస్తా ఎన్ కౌంటర్ , రంపచోడవరం : తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం తహశీల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ గా విధులు నిర్వహిస్తున్న వీర బ్రహం ఏసీబీ అధికారులకు ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టు బడ్డారు.
రంపచోడవరం మండలం సిరి గందలపాడు గ్రామానికి కి చెందిన గుడెం రాంబాబు తన భార్య పట్టా పాసు పుస్తకం లో పేరు మార్పు ఆన్లైన్లో నమోదు చేయుట కొరకు చాలా సార్లు ఆర్ ఐ ని సంప్రదించగా చదు వేల రూపాయలు ఇస్తే పని చేయడం జరుగుతుందని చెప్పడంతో,సదరు వ్యక్తి అయిన రాంబాబు నేరుగా రాజమండ్రి ఏసీబీ అధికారి వారిని సంప్రదించగా, వారు రాజమండ్రి ఏసీబీ డిఎస్పీ వారి అద్వర్యం మంగళవారం దాదాపు గా పన్నెండు గంటల ప్రాంతం లో ఆర్ ఐ వీరబ్రహం లంచం తీసుకుంటూ డగా అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్ని పట్టు కున్నారు.ఈ దాడిలో సి ఎహెచ్ .సౌజన్య(సుపెరినెంట్ ఆఫ్ పోలీస్)పి రామ చంద్రరావు(డిప్యూటి సుపెరినెంట్ ఆఫ్ పోలీస్) వి.పుల్లారావు(ఇన్సు ఫెక్టర్ ఆఫ్ పోలీస్)డి. వాసు కృష్ణ,పి.వి జి.తిలక్,వై.సతీష్ పలువు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.

Comment here