Andhra PradeshEast GodavariNews

ఓటరు నమోదు కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో సింధూ 

ఓటరు నమోదు కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో సింధూ
కోస్తాఎన్ కౌంటర్, రామచంద్రపురం :  చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్, ఆంధ్ర ప్రదేశ్, వెలగపూడి, జిల్లా కలెక్టర్ ఆదేశముల మేరకు  ది.07.10.2021 వ తేదీన మోడరన్ డిగ్రీ కాలేజీ, వి ఎస్ ఎం డిగ్రీ కాలేజీ, వి ఎస్ ఎం ఇంజనీరింగ్ కాలేజీ,  కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ, అగ్రహారం నందు స్పెషల్ క్యాంపు నిర్వహించారు.  ఈ కార్యక్రమము  “ముఖ్య ఉద్దేశ్యం దివి. 01.01.2022 నాటికి 18 సంవత్సరములు నిండిన వారికి (దివి. 31.12.2003 లోపు జన్మించిన వారు) ఓటు హక్కు కల్పించుట”. కావున 42-రామచంద్రపురం నియోజక వర్గం ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, రామచంద్రపురం రెవిన్యూ డివిజనల్ అధికారి స్పెషల్ క్యాంపును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ చే ప్రవేశపెట్టబడిన  ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా 18 సంవత్సరములు నిండిన యువత వారి మొబైల్స్ నందే విహెచ్ ఎ డౌన్లోడ్ చేసుకుని కొత్త ఓటుకు దివి. 30.11.2021 లోపు దరఖాస్తు చేసుకోవలసినదిగా విద్యార్ధులకు తెలిపారు. ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని తెలిపారు. ఇంతేకాక ఈ  యాప్ ద్వారా పేరు/చిరునామా మార్పులు/నియోజక వర్గ పరిధిలో ఓటు బదిలీ/ఓటు తొలగింపు/కొత్త ఓటరు గుర్తింపు కార్డు కొరకు కూడా దరఖాస్తు చేసుకొనవచ్చునని తెలిపారు.  అనంతరం విద్యార్ధులకు  ఓటరు హెల్ప్ లైన్ కి సంబందించిన పాంఫ్లెట్స్ పంపిణీ/పోస్టర్స్/ఫ్లెక్స్ కూడా ప్రచురించడమైనది. ఈ కార్యక్రమములో తహశీల్దారు పి. తేజేశ్వరరావు, రామచంద్రపురం, ఎలక్షన్ డిప్యూటీ జి. శ్రీనివాసు, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ కె. రాంబాబు, సూపర్వైజేర్స్, బూత్ లెవెల్ అధికారులు, కాలేజీలకు సంబందించిన ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, అధిక సంఖ్య లో విద్యార్ధులు పాల్గొన్నారు.

Comment here