Andhra PradeshEast GodavariNews

“కడియంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్”.

“కడియంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్”.
కడియం కోస్తా ఎన్కౌంటర్
కడియం మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో సోమవారం చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా ముగిసింది. మండలంలో 3730 మొదటి డోస్ టీకాలు లక్ష్యం కాగా నూరుశాతం పూర్తయినట్లు పి.హెచ్.సి వైద్యాధికారిణి డా”లత తెలిపారు. ఆమె ఉదయం నుండి పలు వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించి టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మరికొన్ని రోజులు మొదటి డోస్ టీకా కార్యక్రమం జరుగుతుందని , ఇప్పటివరకూ టీకా వేయించుకోని వారు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అలాగే వైద్య సిబ్బంది కూడా టీకా విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్యపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాక్సినేషన్ ఇంఛార్జ్ డా”లావణ్య , పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Comment here