Andhra PradeshEast GodavariNews

“కడియం మండల అధికారులతో సబ్ కలెక్టర్ రివ్యూ” 

“కడియం మండల అధికారులతో సబ్ కలెక్టర్ రివ్యూ”
 కడియం కోస్తా ఎన్కౌంటర్
సచివాలయాలు, ఆర్.బి.కే. భవనాల నిర్మాణాలు, జగనన్న లే-అవుట్లలో నూతన ఇండ్ల నిర్మాణాలపై కడియం మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం అధికారులతో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఇలాక్కీయా రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగవంతం చేయాలని, స్థలాలకు కొరత లేకుండా తహసీల్దార్ తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే జగన్ అన్న లే-అవుట్లలో ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, అందుకుగాను ఎస్.హెచ్.జి. సభ్యులకు బ్యాంకుల ద్వారా సకాలంలో రుణాలు అందేలా ఏర్పాట్లు చేసి నిర్మాణాలకు తోడ్పాటు అందించాలన్నారు. వివిధ ప్రభుత్వ భవన నిర్మాణాల్లో జాప్యం చేస్తున్న గుత్తేదారులను తప్పించి, కొత్తవారికి నిర్మాణ బాధ్యతలు అప్పగించాలన్నారు. నిర్మాణ పనులకు సంబంధించి వెంటనే బిల్లుల చెల్లింపు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో  తహసీల్దార్ జి. భీమారావు, ఎం.డి.ఓ ఈ.మహేష్, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, హౌసింగ్ ఏ.ఈ. సత్యనారాయణ మూర్తి, ఏ.పీ.ఎం. జిలాని, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Comment here