Andhra PradeshEast GodavariNews

కలసి పనిచేద్దాం.. ప్రగతి సాదిద్దాం

కలసి పనిచేద్దాం.. ప్రగతి సాదిద్దాం

రంగంపేట :  మండలంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలసి పనిచేస్తేనే   అభివృద్ది జరుగుతోందని జెడ్పీటీసి పేపకాయల రాంబాబు అన్నారు. శుక్రవారం రంగంపేట మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి రిమ్మలపూడి శ్రీదేవివెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఉద్యోగుల పరిచయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేయడంలో ఉద్యోగులు పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అర్హులకు నవరత్నాలు పూర్తి స్థాయిలో అందించడం కోసం నిరంతర శ్రామికుడుగా పనిచేస్తున్నారని, ఆయన లక్ష్యానికి అనుగుణంగా మీరు, మేము పనిచేయాలన్నారు. నూతన ఎంపిపి కార్యాలయాన్ని ఎంపిపి ఆధ్వర్యంలో పూర్తి చేయాలని ఆకాంక్షించారు.  ఈ సందర్భంగా ఎంపిపి శ్రీదేవి కార్యాలయంలో దేవుని పటాలకు పూజలు నిర్వహించిన అనంతరం జరిగిన సమావేశంనుద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగులు సంపూర్ణ సహకారం అందించాలని, ప్రజా సమస్యల నివృత్తి చేయడంలో  అధికారులు సహకరించాలని కోరారు. మండల ప్రజాపరిషత్‌ కార్యాలయ పరిపాలనాధికారి బి.కృష్ణగోపాల్‌, ఈవోపిఆర్డీ యం భారతి, ఆధ్వర్యంలో మండల ఉద్యోగులు ఎంపిపి రిమ్మలపూడి శ్రీదేవి వెంకటేశ్వరరావును, జెడ్పీటీసి పేపకాయ రాంబాబును, జెడ్పీకోఆప్షన్‌ సభ్యుడు లంక చంద్రన్నను వైస్‌ఎంపిపి రాయుడు రాంబాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రంగంపేట పిఎసిఎస్‌ అధ్యక్షుడు పోతుల బులివీర్రాజు, వైకాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొల్లాటి ఇస్రాయిల్‌, అనపర్తి మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు యం.గోవిందరాజులు, రాష్ట్ర చేనేత సహకరా సంఘ కార్యదర్శి పాలాటి వీరనాగేశ్వరరావు, మండల పరిషత్‌ విప్‌ సుంకర అప్పారావు, ఎంపిటీసి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comment here