Andhra PradeshEast GodavariNews

కాపు, తెలగా, బలిజ ,ఒంటరి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం..

రావులపాలెంలో
కాపు, తెలగా, బలిజ ,ఒంటరి
రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం..
భవిష్యత్తు తరం కోసం కాపు
రిజర్వేషన్ సాధించి తీరాలి
ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ
కోస్తా ఎన్ కౌంటర్ రావులపాలెం  కాపు తెలగా బలిజ ఒంటరి  రాష్ట్ర  విస్తృత స్థాయి సమావేశం రావులపాలెంలోని శ్రీకృష్ణదేవరాయల  కాపు కళ్యాణ మండపంలో జరిగింది ఆదివారం నాడు జేఏసీ నాయకుడు ఆరేటి ప్రకాష్ అధ్యక్షతనతో నిర్వహించిన, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ  పాల్గొని ప్రసంగించారు కరోనా సమయంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ముందుగా రెండు నిమిషాలు జేఏసీ సభ్యులు మౌనం పాటించారు ఈ సందర్భంగా ఆకుల మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్ పోరాటంలో అనేక  సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు త్యాగాలు జరిగాయన్నారు రిజర్వేషన్ సాధించాలంటే రాష్ట్రములోని  కాపు తెలగ బలిజ ఒంటరి అందరు కూడా జేఏసీ ఏర్పడిలని రామకృష్ణ అన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల కాపు సంఘం ప్రతినిధులతో మాట్లాడి, త్వరలోనే విజయవాడలో క్షేత్రస్థాయిలోని భారీ విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి రెండు వేల కోట్లు ఇస్తామని వాగ్దానం ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే హామీలను నెరవేర్చాలన్నారు భారతదేశంలో అత్యున్నత పార్లమెంటులో చేసిన అంశాలు ఆయా రాష్ట్రాలు సంబంధించిందని తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత
రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తో కాపులను బీసీల్లో కలపాలని ఆయన డిమాండ్ చేశారు, కాపు రిజర్వేషన్ ఏ కాకుండా అన్ని వర్గాల రిజర్వేషన్లు ఇదే తీరులో రాష్ట్ర ప్రభుత్వం అణిచివేత చర్యలకు పూనుకుంటుందని ఆయన తెలిపారు,కాపు కార్పొరేషన్ పేరుతో  కాపులను మోసం చేస్తున్నారని పలువురు కాపులు పెద్దలు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు,
పార్టీలకు అతీతంగా కాపు రిజర్వేషన్ కోసం జేఏసీ పోరాటం కొనసాగించాలని వివిధ జిల్లాల నుండి పాల్గొన్న జేఏసీ నేతలు సమావేశంలో నిర్ణహించుకున్నారు ఈ కార్యక్రమంలోపెద్ది లక్ష్మీనారాయణ, కుక్కే సూర్యప్రకాశరావు, తోట రాజీవ్, బద్రి రెడ్డి అప్పారావు, వాసిరెడ్డి యేసుదాసు, లంక ప్రగడ ఉమా మహేశ్వరి, చిన్న మల్లి వెంకట రాయుడు ,ముచ్చర్ల శ్రీ రాములు ,వేమన  శ్రీనివాస్ ,ఒంటెద్దు ప్రసాద్, ఎం.ఎస్.రాజు,  మోసిదేవి శ్రీనివాస్, సంజీవ్ కుమార్, వెంకటరమణ, జై రామ్ రెడ్డి, కడప వెంకటరమణ,నందం వీర వెంకట సత్యనారాయణ,
సాధనాల శ్రీనివాస్,
సాధనాల సత్యనారాయణ,ఆకుల భీమేశ్వరరావు,పాలూరి సత్యానందం,గోపిశెట్టి రామచంద్రుడు, కాపు జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Comment here