Andhra PradeshEast GodavariNews

*కాలానుగుణంగా వచ్చే  వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలి*

 *కాలానుగుణంగా వచ్చే  వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలి*
 పీఎంపీలు  సీజనల్ వ్యాధులపై అవగాహన కల్గి కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై  ప్రజలను అప్రమత్తం చేయాలని రాజానగరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికార్లు  డాక్టర్ రవికుమార్, డాక్టర్ బేబీ రాధిక లు అన్నారు.శనివారం  ది పీఎంపీ అసోసియేషన్ రాజానగరం, రంగంపేట  మండలాల ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బుడ్డిగ అప్పారావు అధ్యక్షతన పీహెచ్సీ  ఆవరణలో *సీజనల్ వ్యాధులు,కరోనా ధర్డ్ వేవ్* పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న వైద్యాధికారులు  మాట్లాడుతూ వర్షాకాలంలో దోమలు, ఈగల వ్యాప్తి వల్ల వైరస్ బ్యాక్టీరియా వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులయిన టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, డయేరియా,ఫైలేరియా,మెదడువాపు తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు.  పీఎంపీలు ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు కనుక ఈ కాలానుగుణంగా వచ్చే  వ్యాధులపై అవగాహన కలిగి ఏది సీజనల్ వ్యాధో,ఏది కరోనా వ్యాధో ముందుగా గుర్తించి త్వరతిగతిన చికిత్స అందేలా చూడాలని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలతో ప్రాధమిక వైద్యం అందించాలని సూచించారు. ఈ సదస్సులో జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు,మండల కార్యదర్శి కాపా సత్యనారాయణ, కోశాధికారి ఎ నాగేశ్వరరావు,ఉపాధ్యక్షులు ఎస్ఎస్ హనుమంత ప్రసాద్, సహాయ కార్యదర్శి నరసింహ మూర్తి, దేశాల వీర్రాజు, జి రత్నకుమార్,చంద్రశేఖర్ లతో పాటు పలువురు సభ్యులు హాజరయ్యారు
 *అధిక రక్తపోటును అశ్రద్ధ చేయవద్దు*
అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే ప్రాణానికే ముప్పని డేఅండ్ నైట్ ఆసుపత్రి వైద్యనిపుణులు డాక్టర్ సయ్యద్ నౌషాద్ అన్నారు. ఆదివారం  ది పీఎంపీ అసోసియేషన్ కోరుకొండ గోకవరం ఏజన్సీ మండలాల సభ్యులకు రాజమండ్రి డేఅండ్ నైట్ ఎమర్జెన్సీ ఆసుపత్రి ఆవరణలో  మండల అధ్యక్షులు పీ చిన్నీ అధ్యక్షతన అధిక రక్తపోటు(హైబీపీ) పై  అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న డాక్టర్ సయ్యద్ నౌషాద్  మాట్లాడుతూ
నేడు ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రాణాంతక వ్యాధులలో అధిక రక్తపోటు ముఖ్యమైనదిగా ఉందని,ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అధిక రక్తపోటు బారిన పడుతున్నారని, రక్తపోటు అధికంగా ఉన్న వారిలో గుండె, మూత్రపిండాలు, మెదడుకు  రక్తప్రసరణ వ్యవస్థ దెబ్బతిని గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉందని,మూత్రపిండాల పనితీరు దెబ్బతిని ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించి అధిక రక్తపోటు వలన కలిగే అనర్ధాలను అదుపు చేసుకోవడానికి ఆహారనియమాలపై శ్రద్ధ వహించాలని, మద్యపానం, ధూమపానం కు దూరంగా ఉండాలని, మానసిక ఒత్తిడి లేకుండా వ్యాయామం చేయాలని అన్నారు.డాక్టర్ కృష్ణ భార్గవ్ మాట్లాడుతూ అధునాతన శస్త్రచికిత్సలు గురించి, లేప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలు గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు, మండల కార్యదర్శి ఎమ్ నాగేశ్వరరావు,కోశాధికారి జి లాజర్,ఉపాధ్యక్షులు వై పవన్,ఎమ్ మల్లేష్, సహాయకార్యదర్శులు ఎస్ భాస్కర్,జి నానీ ,జి వెంకటేష్, పి లక్షణరావు,హాస్పిటల్ సీఈఓ రవిరాజు తదితరులు పాల్గొన్నారు

Comment here