Andhra PradeshEast GodavariNews

కుక్కునూరు లో గిరి నేస్తం కార్యక్రమం వియవంతం

కుక్కునూరు లో గిరి నేస్తం కార్యక్రమం వియవంతం:
జిల్లా ఎస్ పీ రాహుల్ దేవ్ శర్మ హాజరు:
కోస్తా ఎన్కౌంటర్ కుక్కునూరు:గిరి నేస్తం కార్యక్రమంలో బాగంగా ఎస్ పీ కుక్కునూరు పర్యటన చేపట్టారు.
ముందుగా కుక్కునూరు చేరుకున్న ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో విగ్రహాన్ని ఏర్పాటు  కార్యక్రమం చేపట్టారు. ఆనంతరం జిల్లా పరిషత్ కుక్కునూరు స్కూల్ నందు ఏర్పాటు చేయబడిన గిరి నేస్తం సభకు ఎస్ పీ  గిరిజిన సంప్రదాయం తో కూడిన డప్పులతో స్వాగతం పలికారు. పోలీస్ వారు ఏర్పాటు చేసిన బుక్  స్టాల్ పరిశీలన చేశారు.
గిరి నేస్తం  కార్యక్రమానికి ముందుగా  జిల్లా ఎస్ పీ రాహుల్ దేవ్ శర్మ, ట్రైని కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డీ ఎస్ పీ లలితా కుమారి  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
గిరి నేస్తం కార్యక్రమం ఏజన్సీ ప్రాంతంలో నిరుపేద విద్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుంది, నిరుద్యోగులకు ఎంతాగానో చేయూతగా ఉంటుంది.గిరిజన విద్యార్థులకు ఉపాధి,ఉద్యోగాలకు ఎంతగానో  తోడ్పాటుగా ఉంటుందని  ఎస్ పీ తెలిపారు
గిరిజన యువతకు గిరి నేస్తం పుస్తకాలు పంచిపెట్టారు త్వరలో ఎమ్ ఎల్ ఏ సహాయకారంతో ఈ ఏజన్సీ లో లైబ్రరీ ఏర్పాటు చేసి పోలిస్ శాఖ తరుపున తోడ్పాటు ఉంటుందని అన్నారు.
రాష్ట  ప్రభుత్వం దిశ యాప్ ప్రవేశ పెట్టి మహిళలకు మంచి ఆయుధంగా ఉపయేగించేలా చర్యలు చేపట్టిందని,ప్రతి ఒక్కరు దిశ యాప్ ద్వారా సహాయం  పొందాలి అని ప్రతి ఒక్కరు  దిశా ఆప్ ను తమ పోన్ లో ఇన్స్టాల్   చేసుకోవాలి అని తెలిపారు.
గుబ్బల మంగమ్మ  దేవాలయం వద్ద వాగులో కొట్టుకు పోయిన మృత దేహాలను వెతికి బయటకు తీసిన గిరిజిన యువతకు జ్ఞాపిక  ప్రశంసా పత్రాలు,విధి నిర్వహణ ఏజన్సీ ప్రాతం లో గోదావరి వరదలప్పుడు నక్సల్స్ పోస్టల్స్ బయట పడినప్పుడు తమదైన శైలిలో కష్టపడి పనిచేసిన స్థానిక  ఎస్ ఇ శ్రీనివాస్ కి  సిబ్బందికి,బోర్డర్ చెక్ పోస్టులో  చాకచక్య విధులు నిర్వహణ నిర్వర్తిస్తున్న పోలీస్ సిబ్బంది కి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు  అందచేశారు.

Comment here