Andhra PradeshEast GodavariNews

కుక్కునూరు లో బంద్ ప్రశాంతం

కుక్కునూరు లో బంద్ ప్రశాంతం:
 రైతు సంఘం నాయకులు:
కోస్తా ఎన్కౌంటర్ కుక్కునూరు:నల్ల మూడు వ్యవసాయ చట్టాలు, విశాఖ ప్రవేటికరణకు వ్యతిరేకంగా మండలంలో సీపీఎం,సీపీఐ, ఎమ్ ఎల్ న్యూడెమోక్రసీ పార్టీలు  మరియు రైతు సంఘాలు సోమవారం నాడు బంద్ చేపట్టారు.
 కేంద్ర బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకు ప్రజా వ్యతిరేక విధానాలు పెరుగుతున్నాయి,తప్ప ప్రజలకు మేలు చేసే పని ఒక్కటి జరగడం లేదని, విమర్శించారు. ఢిల్లీ సరిహద్దుల్లో కొన్ని నెలలుగా సుదీర్ఘ మైన గొప్ప పోరాటం రైతులు చేస్తుంటే వారికి దేశం లో ఉన్న బీజేపీ మినహా అన్ని పార్టీలు, రైతు సంఘాలు మద్దతు గా నిలిస్తే బీజేపీ ప్రభుత్వం మాత్రం వారిని దేశ ద్రోహులుగా చిత్రకరిస్తూ వారి సమస్యలను గాలికి వదిలేస్తుంది అని, మరో పక్క ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ ప్రవేటికరం చేస్తూ లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు తీసుకువచ్చి కార్మికుల పొట్ట కొట్టింది అని,ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును ఇప్పుడు ప్రవేట్ పరం చేస్తుంది అని, ప్రత్యేక హోదా ఇస్తా అని మోసం చేసి ఈరోజు ఆంధ్రుల ఆత్మ గౌరవం మీద బీజేపీ ప్రభుత్వం కొడుతుంది అని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు నడపడం చేతకానప్పుడు పదవికి రాజీనామా చేసి తప్పుకోకుండా దేశాన్ని అమ్మడం ఏంటని ప్రశ్నించారు, దేశాన్ని నాశనం చెయ్యలని చూస్తే, చూస్తూ ఊరుకునేది లేదని, వెంటనే ప్రజా వ్యతిరేక విధానాలు రద్దు చేసి, అందరికి న్యాయం చెయ్యాలని లేదంటే స్వాతంత్ర్య పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని పోరాటాలు మరింత ఉదృతంగా చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రంశెట్టి నాగేంద్రరావు, సీపీఎం నాయకులు షేక్ మహబూబ్ పాషా, రైతు సంఘ  నాయకులు ఎం.డి ఫుల్లు,సీపీఐ నాయకులు వర్సా నాగేశ్వరరావు, వర్సా పాపారావు, ఎమ్.ఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Comment here