Andhra PradeshEast GodavariNews

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి  ప్రజా వ్యతిరేక విధానాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి  ప్రజా వ్యతిరేక విధానాలు

* పెరిగిన ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం: తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా బీఎంఎస్ కార్మికులు గురువారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బీఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు నక్కా పాండురంగ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా, కార్యక్రమం అనంతరం తహసీల్దార్ కి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. రాజమండ్రి ఎల్పిజి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్మిక సభ్యులు, హెచ్పిసిఎల్ ఆయిల్, పైప్లైన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్మిక సభ్యులు, సంయుక్తంగా నిర్వహించిన ధర్నాలో బి.ఎం.ఎస్. జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగ మాట్లాడుతూ ,ప్రస్తుత కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకంగా అవలంభిస్తున్నాయని తెలిపారు. కార్మికులకు కనీస  వేతనం 24, 000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ నెలలో రావలసిన వేతన కోడ్ చట్టం వెంటనే విడుదల చేయాలని లేకపోతే కార్మికులంతా ఉద్యమము చేపడతామన్నారు. ఎల్పిజి, హెచ్పిసిఎల్ పైప్ లైన్ యాజమాన్యాలు, కాంట్రాక్టర్స్ కార్మికులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న చట్టం వ్యతిరేక నిర్ణయాలు మానుకోకపోతే, త్వరలోనే ఎండగడతాం అన్నారు.  సామాన్యులు వాడే నిత్యవసర వస్తువులైన ఉల్లిపాయలు, వంటనూనె, పప్పు దినుసులు, వంట గ్యాస్, పెట్రోల్ డీజిల్ మొదలైన అన్నీ నిత్యవసర వస్తువులు గణనీయంగా పెరుగు పోతున్న పాటించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి ధరలు అదుపులో వచ్చే విధంగా కృషి చెయ్యాలన్నారు. దీని వల్ల సామాన్య ప్రజానీకం చాలా ఇబ్బందులు ఎదుర్కొని రుణ బాధల ఊబిలోకి పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ధర్నా అనంతరం గోకవరం తాసిల్దారు వారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ సిహెచ్. చంద్రశేఖర్, అధ్యక్ష కార్యదర్శులు పైలు.నాని, బి రామస్వామి, పి శ్రీనివాసరావు, వి. నాగేశ్వరరావు, జి.సూరి బాబు, బి సురేష్, కె భాస్కర్, కె వి వి దుర్గాప్రసాద్, వి ధర్మ రాజ్, వీరబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Attachments area

Comment here