Andhra PradeshEast GodavariNews

కొత్త ఏటీఎం మిషన్ లను ఏర్పాటు చేయాలి

కొత్త ఏటీఎం మిషన్ లను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర దళిత సేన నాయకుల డిమాండ్.

కోస్తా ఎన్ కౌంటర్ ఏలూరు. సుమారు మూడున్నర గంటలకు సుమారు మూడు నుంచి నాలుగు లక్షల జనాభా కలిగిన ఏలూరు నగర ప్రజలకు మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ కి గాని ఏలూరు నగరంలో ఉన్న ఇతర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఎకౌంటు దార్లకు డిపాజిట్ గార్లకు ఏలూరు మొత్తంమీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ఆర్ ఆర్ పేట నందు కేవలం 2 ఏటీఎం డిపాజిట్ మిషన్ లను ఎప్పటి నుంచో కొనసాగిస్తూ ఉండడంవల్ల ఈ డిపాజిట్ మిషన్ లు సరిగా పనిచేయక డినామినేషన్ రిసిప్ట్ లు రాక డిపాజిట్ చేసిన అమౌంటూ డిపాజిట్ మిషన్ లో ఇరుక్కుపోవడం వల్ల ప్రతిరోజు కొంతమంది డిపాజిట్ దారులు ఫిర్యాదు చేస్తున్నారు తీవ్ర అసౌకర్యాల కు  ఇబ్బందులకు డిపాజిట్ దారులు వినియోగదారులు గురి అవుతున్నారు  ఏలూరు నగర ప్రజలు మరియు ఏలూరు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ఎంతో మంది వ్యాపార లావాదేవీలు ఏలూరు నగరంలో కొనసాగిస్తూ ఉంటారు ఈ లావాదేవీ లో భాగంగా ఏటీఎం మిషన్ లో డిపాజిట్లు చేస్తూ ఉంటారు నగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ నందు మాత్రమే ఏలూరులో కేవలం 2 పాత ఏటీఎం డిపాజిట్ మిషన్ స్థానంలో కొత్త ఏటీఎం డిపాజిట్ మిషన్ లను పునరుద్ధరించాలని మరియు వన్ టౌన్ పరిధిలో ఒక ఎస్బిఐ ఏటీఎం డిపాజిట్ మిషన్ మరియు ఏలూరు టౌన్ పరిధిలో ఒక ఎస్ బి ఐ ఎటిఎం డిపాజిట్ మిషన్ మరియు ఏలూరు త్రీ టౌన్ పరిధిలో ఒక ఎస్బిఐ ఏటీఎం డిపాజిట్ మిషన్ లను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జుజ్జువరపు. ప్రకాష్ రీజినల్ బిజినెస్ ఆఫీసర్ అయినా శ్రీ వీర దాసు గారిని కోరి డిమాండ్ చేసినారు అందుకు తప్పనిసరిగా ఏటీఎం డిపాజిట్ మిషన్ లను ఏర్పాటు చేయుటకు కృషి చేస్తామని హామీ ఇచ్చినారు ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు నవీన్ కుమార్ దళిత సేన కార్యకర్తలు పాల్గొన్నారు

Comment here