Andhra PradeshEast GodavariNews

క్రీడాకారులకు ఆర్థిక సహాయం

జాతీయస్థాయి కుడో పోటీలకు ఎంపికైన బొమ్మూరు గ్రామానికి చెందిన  క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేసిన రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్.
 రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామానికి చెందిన మోర్తా శుభాషినీ(18) గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ లో మొదటి సంవత్సరం, గంగవరపు అక్షిత(13) బొమ్మూరు జి. పి. ఆర్. స్కూల్ నందు 9వ తరగతి చదువుతున్నారు.
 వీరు పలు జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి కుడో పోటీలలో ప్రతిభ కనబరిచి, ఈ సెప్టెంబర్ 5-7 వరుకు హిమాచల్ ప్రదేశ్ సొలాన్ లో జరిగే జాతీయ స్థాయి కుడో పోటీల్లో మోర్తా సుభాషినీ అండర్-19 కేటగిరీ లో మరియు గంగవరపు అక్షిత అండర్-13 కేటగిరీ లో విద్యార్థినులు ఆడనున్నారు.
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు కావడంతో.. పోటీలకు వెళ్లేందుకు ఖర్చులకు గాను జాతీయ క్రీడ దినోత్సవ రోజున చందన నాగేశ్వర్ గారు వీరు ఇద్దరికి ఖర్చులకు గాను రూ.20 వేలు రూపాయలు తన సాయాన్ని అందజేశారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తన ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థినులు చందన నాగేశ్వర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియాయజేశారు.
 ఈ కార్యక్రమంలో బొమ్మూరు GPR ZPP హైస్కూల్  హెచ్ఎం ఎ రాజేశ్వరి,చైర్మన్ విద్య కమిటీ చైర్మన్ కె .కుమార్, మత్సెటి శివ , చెల్లాయమ్మ, తోడేటి రాహుల్, జాల మోషే, కొమ్మన కోటి,స్వామి తదితరులు పాల్గొన్నారు.

Comment here