Andhra PradeshEast GodavariNews

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధం

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధం

కోస్తాఎన్ కౌంటర్ ,రామచంద్రపురం :  గర్భస్థ శిశు  లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రపురం రూరల్ మండలం వెల్ల గ్రామ పీహెచ్ సి నందు సోమవారం  జరిగిన డివిజన్ స్థాయి అవగాహన సదస్సులో  వైద్య నిపుణులు సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ రామచంద్రపురం డివిజనల్ అధికారి కే. సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పి సి పి ఎన్ డి పి చట్ట తీవ్రత గురించి, లింగ నిర్ధారణ పై కలిగే దుష్పరిణామాల పై ప్రజల్లో అవగాహన పెంచి చైతన్యం చేశారు.  విశిష్ట సేవలు అందించిన అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్లకు ప్రశంసాపత్రాలు అందించారు. అంతేగాక డివిజనల్ పరిధిలోని 18  ఆరోగ్య కేంద్రాలలోని  ఎంపిక చేసిన సిబ్బందికి ఉత్తమ సేవాప్రశంసాపత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ఆది నారాయణ, డాక్టర్ శివరంజనిలు ఉత్తమ వైద్యాధికారులుగా ప్రశంసాపత్రాలను అందుకున్నారు.  కార్యక్రమంలో వెల్ల పి హెచ్ సి సూపర్వైజర్లు పి.ఈశ్వరమ్మ, శ్రీనివాసరావు, కమల్ శేషు,  సిబ్బంది పాల్గొన్నారు.

Comment here