Andhra PradeshEast GodavariNews

గర్భిణీలతొ ఆగిపోయిన 108

గర్భిణీలతొ ఆగిపోయిన 108

* 108 వాహనానికి ఫంక్చర్
* టైరు తీసుకుని వెళ్లి ఫంక్చర్ వేయించుకుని వచ్చిన సిబ్బంది
* 1 గంట నుండి 3 గంటల వరకు రోడ్డు పైనే

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  ఆపదలో సహాయం చేసే 108 కే సహాయం కావాల్సి వచ్చింది.. కానీ ఎవ్వరు స్పందించలేదు.. సిబ్బందే వెళ్లి బాగు చేయించుకుని వచ్చారు.. అంతవరకు ప్రధాన రహదారిపై నిండు గర్భిణీలు, వారి బంధువులు, సిబ్బంది పడిగాపులు పడ్డారు. మంగళవారం గోకవరం మండలం రామన్నపాలెం గ్రామ సమీపంలో ప్రధాన రహదారి పై 108 వాహనం టైరుకి ఫంక్చర్ అయ్యి నిలిచిపోయింది. రంపచోడవరం నుండి ఇద్దరు గర్భిణీలు, ముగ్గురు వారి బంధువులతో వస్తుంది. గర్భిణీలను రాజమండ్రి లోని ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీ కోసం తీసుకువెళ్తున్నారు. ఇంతలో టైరుకి ఫంక్చర్ అయింది.. సమీపంలో ఉన్న సహచర మిత్రులకు, ఉద్యోగులకు ఫోన్ చేసిన ఫలితం కనిపించలేదు. వాహనంలో ఉండే అదనపు టైరులో కూడా గాలి లేకపోవటంతో ఇబ్బందులు పడ్డారు. ఇక చేసేది లేక 108 సిబ్బంది గోకవరం వచ్చి ఫంక్చర్ వేసుకుని వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు వీరంతా రోడ్డు పైనే ఉండిపోయారు. 108 వాహనం టైర్లు అసలు బాగోలేదు. వీటిని మార్చాల్సి ఉంది.. ఇంతటి సేవలు అందిస్తున్న వాహనానికి తరుచూ ఇలా జరిగితే అందరు ఇబ్బందులు పడాల్సిందే. ప్రధాన రహదారిపై జరిగింది కాబట్టి కొంచెం పర్లేదు. అదే ఏ మారుమూల ప్రాంతంలో జరిగితే, పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. తక్షణం అన్ని 108 వాహనాలను పరిశీలించి అధికారులు కొత్త టైర్లు వేయిస్తే మంచిది.

Comment here