Andhra PradeshEast GodavariNews

గాంధీజీ మార్గం అనుసరణీయం

  గాంధీజీ మార్గం అనుసరణీయం
కోస్తాఎన్ కౌంటర్ రామచంద్రపురం :  గాంధీ జయంతి పురస్కరించుకుని స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో  శనివారం  పార్టీ నాయకులు గాంధీజీ చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెదేపా  నాయకులు మాట్లాడుతూ 20వ శతాబ్ది నేతలలో  అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన  నాయకునిగా గాంధీజీని కేబుల్ న్యూస్ నెట్వర్క్    (సి ఎన్ ఎన్ ) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారన్నారు. ప్రతి ఒక్కరూ  గాంధీజీ చూపిన శాంతి, అహింస మార్గంలో పయనించాలని, బాపూజీ మార్గం అనుసరణీయమని అన్నారు .
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు  గరికపాటి సూర్యనారాయణమూర్తి, చింతపల్లి వీరభద్రరావు, మేడిశెట్టి సూర్యనారాయణ, కడియాల రాఘవన్, జొన్నకూటి భాస్కర  రావు, నండూరి ఫణికుమార్, జాస్తి విజయలక్ష్మి చక్రవర్తి, లక్ష్మణరావు, నరసింహారావు,  పంపన శ్రీను , వనుం చంటిబాబు,  బిక్కిన శివజానకిరామయ్య, బిక్కిన పవన్ కుమార్, కొసనా శ్రీనివాస్, బలుసు శివప్రసాద్ , ఈదల దొరబాబు, బాబ్జి  తదితరులు  పాల్గొన్నారు.

Comment here