Andhra PradeshEast GodavariNews

“గాంధీజీ-శాస్త్రీజీ”లకుగణిత చదరాలతో శుభాకాంక్షలు”

“గాంధీజీ-శాస్త్రీజీ”లకుగణిత చదరాలతో శుభాకాంక్షలు”
గాంధీజీ 152 జయంతి లాల్ బహుదూర్ శాస్త్రీ జీ 117వ జయంతి సందర్బంగా గణిత చదరాలతో నివాళి
కోస్తాఎన్ కౌంటర్, గండేపల్లి : గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల క్యాషియర్&మీడియా మేనేజర్ తోటకూరగంగాధర్ కుమారుడు   బాలగణితావధాని తోటకూర వి.ఎస్.ఎస్.సాయి వంశీ ది. 02-10-2021 శనివారం జాతిపిత మహాత్మాగాంధీ 152వ జన్మదినం మరియు లాల్ బహుదూర్ శాస్త్రీ మహాత్మా గాంధీ ప్రభావంతో అతను మొదట మహాత్మా గాంధీకి, తరువాత జవహర్లాల్ నెహ్రూ కు నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతను భారతదేశ ప్రభుత్వంలోచేరి జవహర్ లాల్  నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా (1951–56), తరువాత హోంమంత్రిగానే కాక ఇతర భాద్యతలను కూడా చేపట్టాడు. నెహ్రు తర్వాత భారతదేశానికి రెండవ ప్రధానిగా పనిచేశారు.శాస్త్రీ జీ 117వ జయంతి    పురస్కరించుకొని తనకు ఎంతో ఇష్టమైన గణితచదరాల ద్వారా ఆమహానాయకులకు శుభాకాంక్షలు తెలియజేయడం అనందంగా ఉందని వంశి అన్నారు. ఈ చదరాలలో   అడ్డువరుసలు మొత్తం,నిలువ వరసలు మొత్తం,కర్ణాల మొత్తం ఈ విధంగా పలు విధాలుగా  ఎటు కూడిన 152వచ్చే విధంగా అలాగే ఎటుకూడిన 117వచ్చే విధంగా వేరువేరు విధాల  చదరాలను రూపొందించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. జాతీయ పర్వదినాలు,మహనీయుల పుట్టిన రోజు తదితర వేడుకలు ఈ విధంగా గణిత చదరాల ద్వారా తెలియజేయడం తన  సాయి వంశి తెలియజేసారు. వైజాగ్ గాయత్రి విద్యాపరిషత్ నందు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుచున్న సాయి వంశీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ మరియు పెద్దాపురం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ దవులూరి దొరబాబు,రాష్ట్రకార్మిక సంఘం నాయకులు దవులూరి సుబ్బారావు,జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గణితావధాని తోటకూర సాయిరామకృష్ణ తదితరులు అభినందించారు.

Comment here