Andhra PradeshEast GodavariNews

గృహ నిర్మాణ దారులకు అండగా నిలవండి

గృహ నిర్మాణ దారులకు అండగా నిలవండి
…. గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
 కాకినాడ ఆర్డీవో చిన్ని కృష్ణ
కోస్తా ఎన్ కౌంటర్, సర్పవరం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా చేయాలని కాకినాడ ఆర్టీవో చిన్ని కృష్ణ పేర్కొన్నారు. బుధవారం నాడు కాకినాడ రూరల్ మండలంలోని తిమ్మాపురం గ్రామం లో గృహ నిర్మాణం ఆర్డీవో పరిశీలించారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం లోని నేమాం, పండూరు, తిమ్మాపురం గ్రామాల్లో    లబ్ధిదారునికి ఇచ్చిన స్థలాల్లో గృహ నిర్మాణాలు చేపడుతున్న వారికి కరెంటు సప్లై ,వాటర్ మరియు ఇసుక ,ఐరన్ అన్నీ అందుబాటులో ఉంచాలని కోరారు. సచివాలయ ఉద్యోగుల తో మాట్లాడుతూ లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తే త్వరితగతిన గృహ నిర్మాణాలు పూర్తవడం జరుగుతుందని తెలిపారు. తిమ్మాపురం,  నేమ గ్రామంలో గృహ నిర్మాణ దారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలపడం జరిగిందన్నారు. వారందరికీ నిర్మాణాలకు సంబంధించి ఏ అవసరం కావాలన్నా తక్షణమే సచివాలయ సిబ్బంది గృహ నిర్మాణ అధికారులు అందుబాటులో ఉండి వారికి కావలసిన మెటీరియల్ను అందించాలని కోరారు. గృహ నిర్మాణ దారులు కూడా త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎం డి ఓ పాఠం సత్యనారాయణమూర్తి, ఇ ఈ ఓ పి ఆర్ డి భాస్కర్ రావు, హౌసింగ్ డి ఈ కె.వి.ఆర్ గుప్తా,  ఎం శ్రీనివాసరావు, ఇన్చార్జి తాహసిల్దార్  మురార్జీ, పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావు, సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ వీఆర్వో ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
*నిర్మాణదారులు ఆందోళన *
గృహ నిర్మాణాలు చేపడుతున్నా లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. గృహ నిర్మాణాలు చేపడుతున్న వారికి పునాదుల్లో మట్టి నిమిత్తం ఒక లారీ కు 25 వేల నుండి 27 వేల వరకు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఐరన్ కోతకు కరెంటు సప్లై లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జరుగుతుందన్నారు. పునాదుల్లో మట్టిని కొమ్ము తీర్చేందుక ఒక టాంకర్ ధర రూ 1000  వసూలు చేయడం జరుగుతుందన్నారు. లేఅవుట్లు రోడ్లు సరిగా లేకపోవడం వల్ల మెటీరియల్ తెచ్చుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు దీనిపై దృష్టి సారించి గృహ నిర్మాణ దారులకు న్యాయం చేయాలని కోరారు. గృహ నిర్మాణదారులకు ప్రభుత్వం నుంచి గాని గృహ నిర్మాణ సంస్థ నుంచి గాని ఒక్క రూపాయి కూడా ఖాతాదారులకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెటీరియల్ కోసం సచివాలయం చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని డబ్బులు వృథాగా  పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Comment here