Andhra PradeshEast GodavariNews

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా..!

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా..!
` ఎంపీపీ దాసరి హైమావతి
పెంటపాడు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన దాసరి హైమావతి….

కోస్తా ఎన్‌కౌంటర్‌ పెంటపాడు : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎంపీపీ దాసరి హైమావతి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన పెంటపాడు మండల పరిషత్‌ కార్యాలయంలో ఆమె ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు పూలమాలలు వేసి అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆశీస్సులతో ఈ పదవి వచ్చిందన్నారు. ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు కొణతాల వెంకట్రావు, రెడ్డి సూరిబాబు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లమిల్లి విజయానందరెడ్డి, కొవ్వూరి విజయభాస్కర్‌రెడ్డి, దేవబత్తుల వెంకన్నబాబు, కర్రి వరహాలరెడ్డి, కర్రి లక్ష్మణరెడ్డి, నల్లమిల్లి ప్రభాకరరెడ్డి తదితరుల పాల్గొన్నారు.

Comment here