Andhra PradeshEast GodavariNews

గ్రామ పాలనలో వార్డు సభ్యులే కీలకం:ఎంపీపీ సత్య వేణి

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:గ్రామ పాలనలో వార్డు సభ్యులు కీలకమని ఎంపీపీ మేడిశెట్టి సత్య వేణి అన్నారు. కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయం సభా మందిరంలో రెండ సభ్యులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటరామన్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ విధులు-బాధ్యతలపై వార్డు సభ్యులు అవగాహన చేసుకోవాలని సూచించారు.వీధి  దీపాలు,మురుగు కాలువలు,పారిశుధ్య నిర్వహణ వంటి విషయాల్లో చురుగా ఉండాలని ఈఓపిఆర్డి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.నేలటూరు,వల్లూరు,టేకి, వెదురుమూడి,వడ్లమూరు,నల్లూరు,పడమర ఖండ్రిగ, అద్దంకివారి లంక,కోరుమిల్లి గ్రామాలకు చెందిన వార్డు సభ్యులకు శిక్షణానంతరం ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ గజలక్ష్మి, ఏపీవో కవిత,ఏపీఓతవుడు బాబు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Comment here