Andhra PradeshEast GodavariNews

గ్రామ సచివాలయలను సందర్శించిన జేసీ రాజకుమారి

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం మండలంలోని అంగర,పడమర కండ్రిక గ్రామాల సచివాలయాలను బుధవారం జె.సి రాజకుమారి సందర్శించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలుపై సచివాలయ సిబ్బందితో సమీక్షించారు.సంక్షేమ పథకాలు అమలులో క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను సచివాలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా సచివాలయ సిబ్బంది కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు.ప్రభుత్వం నుండి వస్తున్న ఉత్తర్వుల అమలు పరుస్తూ నిర్ణీత గడువులోపుగా ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ కార్డులు,సామాజిక పింఛన్లు,వైయస్సార్ బీమా, రైతు భరోసా,పంట బీమా పథకాలు జరుగుతున్న తీరును ఆయా శాఖల ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు.సర్పంచ్, ఉప సర్పంచ్ వాసా కోటేశ్వరరావు,యర్ర వీరన్న బాబు రేషను,సామాజిక పింఛన్లు మంజూరు లో ఉన్న ఇబ్బందులను జెసి దృష్టికి తెచ్చారు.వాటిపై ఆమె వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో పడమర కండ్రిక సర్పంచ్ తిరునాతి ఆదిలక్ష్మి వెంకటేశ్వర్లు,ఎంపిడిఓ వెంకటరామన్, ఈ ఓ పిఆర్డి రామకృష్ణారెడ్డి,కార్యదర్శి నాగార్జున,విఆర్ ఓ నాగమణి,డిజిటల్ వెల్ఫేర్ అసిస్టెంట్ లు శ్రీకాంత్,  వివేక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comment here