Andhra PradeshEast GodavariNews

ఘనంగా గాంధీజీ, శాస్త్రీజీల జయంతి వేడుకలు

ఘనంగా గాంధీజీ, శాస్త్రీజీల జయంతి వేడుకలు

కోస్తాఎన్ కౌంటర్, రామచంద్రపురం:  ద్రాక్షారామలో జాతి పిత మహాత్మాగాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలను  ఘనంగా నిర్వహించారు. తొలుత  ఇరువురి నేతల చిత్ర పటాలకు నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షులు యాట్ల నాగేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం యాట్ల మాట్లాడుతూ క్షణ క్షణం దండయాత్రలతో  కొట్టుకు చస్తున్న ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు మహాత్మాగాంధీజీ అని అన్నారు. అలాగే  భారతదేశ స్వాతంత్రోద్యమ ప్రముఖ సూత్రధారి, భారతదేశ  ద్వితీయ ప్రధాని, నిస్వార్థపరుడు, ప్రధాని పదవికి వన్నె తెచ్చిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి అని  లాల్ బహదూర్ శాస్త్రి 117 వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఇరువురు నేతలు సహాయ నిరాకరణం,విదేశీ వస్త్ర బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా  ఉద్యమాలు నిర్వహించి ఎన్నో మార్లు జైలుకు వెళ్లారని యాట్ల తెలిపారు. లాల్ బహుదూర్ శాస్త్రి 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధ కాలంలో దేశాన్ని ముందుకు  నడిపించిన ధీశాలి అని ఆయన పేర్కొన్నారు.  జై జవాన్, జై కిసాన్ అను శాస్త్రీజీ  నినాదాలే ఆనాటి  యుద్ధ సమయంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి నేటి కాలంలో సైతం  ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని యాట్ల తెలిపారు. ఇటువంటి మహనీయులు  భారతీయుల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారని ఆయన అన్నారు. అనంతరం అందరికీ  మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి రామారావు, గరగ గణపతి, ముద్రగడ శ్రీను, గంపల వెంకట సోమరాజు, మెడిశెట్టి శ్రీనివాస్, బండి వీరు, కే భద్రరావు, కాజ మొహిద్దిన్, గుల్జార్ హుస్సేన్,  ఆగాహుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Comment here