Andhra PradeshEast GodavariNews

ఘనంగా నిర్వహించిన విశ్వకర్మ జయంతి

ఘనంగా నిర్వహించిన విశ్వకర్మ జయంతి

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం: శుక్రవారం  హెచ్పిసిఎల్ ఎల్పిజి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, హెచ్ పి సి ఎల్ ఆయిల్ పైప్ లైన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ , ఆధ్వర్యంలో బి ఎం ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నక్క పాండురంగ సారధ్యంలో రెండు చోట్ల వేర్వేరు గా  విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. బి ఎం ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నక్క పాండురంగ మాట్లాడుతూ బ్రహ్మ దేవుడు ప్రతిరూపం అయిన  విశ్వకర్మను ప్రతి రూపంగా భావించి ఆయన పుట్టిన రోజును జయంతిని ఘనంగా జరుపుకోవటం మనకెంతో గర్వ కారణమన్నారు. బి ఎం ఎస్ ఈ రోజున ఇండస్ట్రీలో జయంతి సందర్భంగా యంత్రాలకు పూజలు చేయటం జరుగుతుందన్నారు. ఈ రోజును జాతీయ స్థాయిలో సెలవు దినంగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ సిహెచ్ శ్రీనివాసరావు, అధ్యక్ష కార్యదర్శులు పి నాని, బట్టల రామస్వామి, శ్రీనివాస్, జి శ్రీనివాస్, ఎం శీను,  అశోక్ కుమార్,   కార్మిక సోదరులు తదితరులు పాల్గొన్నారు,

Comment here