Andhra PradeshEast GodavariNews

ఘనంగా మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పద్మావతి జన్మదినోత్సవం

ఘనంగా మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పద్మావతి జన్మదినోత్సవం
ఫొటో : 04టిపిజి04 : తాడేపల్లిగూడెంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ దేవతి పద్మావతిని సన్మానిస్తున్న దృశ్యం…..
కోస్తా ఎన్‌కౌంటర్‌ తాడేపల్లిగూడెం : మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా దేవతి పద్మావతి 60వ జన్మదినోత్సవాన్ని సోమవారం ఆమె నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు గ్రంధి సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణానికి ఆదర్శవంతమైన పాలనను అందించారన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం పాల్గొంటూ ప్రజలకు ఇతోధిక సేవలందించారన్నారు. ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు చిక్కాల రామకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పద్మావతి అందించిన సేవలను కొనియాడారు. అవినీతి రహితంగా అభివృద్ధి చేశారన్నారు. డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించడం విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు నున్నా ఆనంద్‌, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు అనూరాధ, సోమరాజు, పోర్ట్‌గేట్‌ అధినేత దేవతి రామకోటేశ్వరరావు, వైసీపీ నాయకులు ముప్పిడి సంపత్‌కుమార్‌, ఉప్పరగూడెం సర్పంచ్‌ కనకబాబు, మాజీ కౌన్సిలర్లు గొర్రెల లక్ష్మీ నర్సమ్మ, పత్సమట్ల సావిత్రి, సిద్ధాబత్తుల ఆదిలక్ష్మి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comment here